
ప్రస్తుతం ఓటీటీలో ఒక సినిమా దుమ్మురేపుతోంది. ఆకట్టుకునే కథ కథనాలతో ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇగో కారణంగా భార్య, భర్తల మధ్య తలెత్తే సమస్యలను ఇందులో అద్బుతంగా చూపించారు. దంపతుల గొడవల్లో చుట్టు పక్కల ఉండే వాళ్లు ఎలా పెట్రోల్ పోసి ఆనందిస్తారనే విషయాన్ని సటైరికల్ గా చూపించారు. మరీ ముఖ్యంగా అసలైన ఫెమినిజంకి సూడో ఫెమినిజంకి తేడాను కూడా ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే… శివ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చుట్టూ తిరుగుతుంది. పెద్దలు నిశ్చయించడంతో శక్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మొదటి నెల రోజులు బాగానే ఉంటారు. కానీ ఆ తర్వాతే అసలు సమస్యలు మొదలవుతాయి. దంపతుల మధ్య మనస్పర్థలు మొదలవుతాయి. ఏడాది తిరిగేసరికల్లా కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. పరస్పర అంగీకారంతో కోర్టు మెట్లెక్కుతారు. మరి పెళ్లయిన ఏడాదికే శివ-శక్తి.. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలేం జరిగింది? చివరకు వీళ్లిద్దరూ కలిశారా? లేదా? అనేది మిగతా స్టోరీ.
ఇటీవల తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ తమిళ అనువాద చిత్రం పేు ఆన్ పావం పొల్లతత్తు (Aan Paavam Pollathathu). రెండేండ్ల క్రితం జో అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హిట్ ఫెయిర్ రియో రాజ్ , మాళవిక మనోజ్ ఈ మూవీలో మరోమారు హీరో హీరోయిన్లుగా నటించారు. ఆక్టోబర్ 31 న తమిళ నాట థియేటర్లలో రిలీజైన ఈ రొమాంటిక్, సెటైరికల్ కామెడీ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల క్రితమే జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చింది.తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు మరీ ముఖ్యంగా జెన్ జెడ్ తప్పక చూడాల్సిన మస్ట్ వాచ్ ఫిలిం ఇది. డోంట్ మిస్.
In every universe, they are meant for each other ❤️💫#AanPaavamPollathathu now streaming only on JioHotstar #JioHotstar #AanPaavamPollathathuOnJioHotstar #AanPaavamPollathathuNowStreaming #JioHotStarTamil @rio_raj @imalavikamanoj @kalaiyinkural @RjVigneshkanth… pic.twitter.com/XywmzQ4kkZ
— JioHotstar Tamil (@JioHotstartam) December 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.