OTT Cinema : భర్తలను చంపేందుకు భార్యల డీల్స్.. ట్విస్టులతో సాగే రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో ట్రెండింగ్..

ఒకరి భర్తను మరొకరు చంపాలని ఇద్దరు భార్యలు డీల్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ? ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? అనేది ఈ సిరీస్ కాన్సెప్ట్. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. అదిరిపోయే ట్విస్టులు, ఊహించని మలుపులతో సాగే ఈ సిరీస్ ఇప్పుడు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ సిరీస్ పేరెంటో తెలుసుకుందామా.

OTT Cinema : భర్తలను చంపేందుకు భార్యల డీల్స్.. ట్విస్టులతో సాగే రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో ట్రెండింగ్..
Karma Korma

Updated on: Dec 24, 2025 | 7:07 AM

సాధారణంగా ఓటీటీలో విభిన్న కాన్సెప్ట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్ లను అడియన్స్ ముందుకు తీసుకువస్తుంటారు మేకర్స్. హారర్, సస్పె్న్స్, మిస్టరీ సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఒకరి భర్తను మరొకరు చంపేలా ఇద్దరు భార్యలు డీల్ ఫిక్స్ చేసుకుంటారు. కానీ ఆ తర్వాత వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. ఇద్దరి జీవితాల్లో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆద్యంతం మలుపులతో థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఈ సిరీస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ సిరీస్ పేరు కర్మా కోర్మా. ఇందులో రివేంజ్ తోపాటు వంటలు, స్నేహం, రొమాన్స్ అంశాలు కూడా ఉంటాయి.

ఇవి కూడా చదవండి :  Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్‏బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇది బెంగాలీ వెబ్ సిరీస్. ఊహించని హత్యలు, భర్తల మర్డర్ ప్లాన్ చేసే భార్యల ప్లానింగ్ తో ఈ సిరీస్ సాగుతుంది. ఇందులో బెంగాలీ నటీనటులు రితాభరి చక్రవర్తి, సోహిణి సర్కార్ ప్రధాన పాత్రలు పోషించారు. మన జీవితంలో కర్మ మనం చేసిన పనుల ఫలితం అయితే.. కోర్మా రుచికరమైన భోజనం. ఈ రెండింటినీ కలిపి పదునైన క్రైమ్ త్రిల్లర్ గా మలిచారు డైరెక్టర్ ప్రతీమ్ డి. గుప్తా. వంటల ద్వారా ఇద్దరు మహిళల మధ్య ఏర్పడిన పరిచయం మరింత బలంగా మారుతుంది. ఆ తర్వాత ఆ స్నేహం పగ, ప్రతికారం, హత్యలకు దారి తీస్తాయి.

ఇవి కూడా చదవండి :  Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..

అప్పటికే భర్తలతో విసిగిపోయిన ఈ ఇద్దరు వారిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుంటారు. అందుకు ఒకరి భర్తను మరొకరు చంపాలని డీల్ కుదుర్చుకుంటారు. అందుకు వంటతోనే చంపాలని ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాతే అసలు ట్విస్టులు మొదలవుతాయి.. చివరకు ఇద్దరు జీవితాల్లో ఏం జరిగిందనేది సినిమా. ప్రస్తుతం ఈ సిరీస్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం బెంగాలీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి :  Actress : ఎక్కువగా కనిపించాలని ఆ డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..