The Warriorr Movie: అప్పుడే ఓటీటీలోకి రామ్ వారియర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

The Warriorr OTT Release: టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన చిత్రం ది వారియర్‌ (The Warriorr). బేబమ్మ కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించింది. యంగ్‌ హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ప్రతినాయకుడిగా కనిపించాడు.

The Warriorr Movie: అప్పుడే ఓటీటీలోకి రామ్ వారియర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
The Warriorr

Updated on: Jul 31, 2022 | 2:13 PM

The Warriorr OTT Release: టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన చిత్రం ది వారియర్‌ (The Warriorr). బేబమ్మ కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించింది. యంగ్‌ హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ప్రతినాయకుడిగా కనిపించాడు. ప్రముఖ కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వం వహించారు. పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 14న తెలుగుతో పాటు తమిళ్‌ భాషల్లో విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. రామ్‌ నటన బాగున్నా పసలేని కథనం వారియర్‌ పెద్ద మైనస్‌గా మారింది. ఈక్రమంలో సినిమా విడుదలై నెల రోజులైనా గడవక ముందే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కాగా ఈ విషయాన్ని డిస్నీ హాట్‌స్టార్‌ సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. హి ఈజ్‌ రెడీ అంటూ ట్వీట్‌ చేసింది. అయితే థియేటర్లలో విడుదలై నెలరోజులైనా గడవక ముందే ఓటీటీల్లో రావడంపై సినీ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్‌లో వారియర్‌ సినిమాను మిస్‌ అయినవాళ్లు ఆగస్టు11 దాకా వెయిట్‌ చేయండి. ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని వీక్షించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..