OTT Movie: ఈ సిరీస్ చూసిన తర్వాత మొబైల్ వాడాలంటే భయపతారు.. OTTని షేక్ చేస్తోన్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండ్ అవుతోంది. తెలుగుతో పాటు పలు భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండడంతో ఈ సిరీస్ కు భారీ వ్యూస్ వస్తున్నాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు టాప్ రేటింగ్ లభించింది.

OTT Movie: ఈ సిరీస్ చూసిన తర్వాత మొబైల్ వాడాలంటే భయపతారు.. OTTని షేక్ చేస్తోన్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్
OTT Movie

Updated on: Jul 08, 2026 | 8:30 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. రామ్ చరణ్ పెద్ది, సింగ్ గీతం’ , బల్టీ, పరిమళ అండ్ కో చిత్రాలు ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. అయితే గత వారం (జులై 03) ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. మొబైల్ ఫోన్ హ్యాకింగ్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ కు ఊహించని రేంజ్ లో భారీ వ్యూయర్ షిప్ వస్తోంది. ఐఎమ్ డీబీలో టాప్ రేటింగ్ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బోజ్‌పురి భాషల్లో అందుబాటులో ఉంది.
ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కథ విషయానికి వస్తే.. గోవాలో తన తాతయ్యతో కలిసి జీవిస్తుంటాడు ప్రీతమ్ వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్ మ్యాన్‌గా పని చేస్తుంటాడు. ఒక రోజు తన తాతకు ఎంతో ఇష్టమైన టేప్ రికార్డర్ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. అక్కడ పెడ్రో అనే వ్యక్తి పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంటాడు. ప్రీతమ్ వచ్చిన సమయంలోనే అదే స్టేషన్ కు ఒక హై-ప్రొఫైల్ ఏటీఎం దొంగతనం కేసు వస్తుంది. దాన్ని ఎలా ఛేదించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటారు. అప్పుడు ప్రీతమ్, తనకు తన టేప్ రికార్డర్ తెచ్చి పెడితే ఏటీఎం దొంగలను పట్టుకుంటానని చెబుతాడు. అందుకు పోలీసులు కూడా ఒకే అంటారు.

చెప్పినట్లుగానే ప్రీతమ్ తన కంప్యూటర్‌ను ఉపయోగించి కేవలం పది నిమిషాల్లో ఏటీఎం దొంగల ఆచూకీని కనుగొంటాడు. అలా సైబర్ కేసుల విచారణలో భాగంగా కొన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయి. సరిగ్గా అదే సమయంలో, క్రీడల మంత్రి కుమారుడు అదృశ్యమవుతాడు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. అసలు ప్రీతమ్ గతం ఏంటి? ఏటీఎం దొంగలను ఎలా పట్టుకున్నాడు? ఎందుకు టెక్నాలజీని వదిలేసి సేల్స్ మ్యాన్‌గా వర్క్ చేస్తున్నాడు? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలసిందే.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ పేరు ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’. త్రీ ఇడియట్స్, పీకే, సంజు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ సిరీస్‌కు స్టోరీ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ‘పాతాళ్ లోక్’ ఫేమ్ అవినాష్ అరుణ్ ధవారే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ప్రీతమ్‌గా వీర్ హిరానీ, పెడ్రో అనే పోలీస్ అధికారిగా అర్షద్ వార్సి మెప్పించాడు. హ్యాకర్ మార్టిన్‌ పాత్రలో విక్రాంత్ మస్సే అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సగటున 35 నిమిషాల నిడివి ఉంటుంది.

తెలుగులోనూ ఉంది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us