AHA OTT: రాజేంద్ర ప్రసాద్‌ ‘సేనాపతి’ ట్రైలర్‌ విడుదల.. ఆహాలో స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే..

|

Dec 21, 2021 | 9:43 PM

ఇటు టాక్‌షోలు, అటు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌లు.. ఇలా తెలుగు ప్రేక్షకులకు 100 శాతం వినోదాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది ప్రముఖ ఓటీటీ మాధ్యమం 'ఆహా'.

AHA OTT: రాజేంద్ర ప్రసాద్‌ సేనాపతి ట్రైలర్‌ విడుదల.. ఆహాలో స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే..
Follow us on

ఇటు టాక్‌షోలు, అటు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌లు.. ఇలా తెలుగు ప్రేక్షకులకు 100 శాతం వినోదాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది ప్రముఖ ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. ఈక్రమంలోనే విభిన్న కథలతో కూడిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో ‘సేనాపతి’ అనే వెబ్‌సిరీస్‌ను రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్‌కు కూడా ఇదే మొదటి వెబ్‌సిరీస్‌ కావడం విశేషం. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ ఈ సిరీస్‌ను నిర్మించారు. గతంలో ‘ప్రేమ ఇష్క్ కాద‌ల్’ వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శకుడు ప‌వ‌న్ సాధినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. 2017లో తమిళంలో వచ్చిన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘8 తొట్టక్కల్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సేనాపతి’ సినిమా పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా ఈనెల 31 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ‘వరల్డ్​ ఆఫ్ సేనాపతి’ పేరుతో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, సస్పెన్స్ ఎపిసోడ్స్‌తో ఉత్కంఠగా సాగింది. రాజేంద్రప్రసాద్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్ ఓవర్‌లో చెప్పిన ఒగ్గు కథ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌తో పాటు న‌రేష్ అగ‌స్త్య, జ్ఞానేశ్వర్ కందేర్గుల‌, హ‌ర్షవ‌ర్దన్‌, రాకేందు మౌళి త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించారు.

Also Read:

Dulquer Salmaan: బృందా మాస్టర్‌ మొదటి సినిమా.. దుల్కర్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. సినిమా విడుదల ఎప్పుడంటే..

Sandeep Reddy: పుష్ప సినిమాను వీక్షించిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. బన్నీ గురించి ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..

Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్ కు షాక్ !! పవన్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే ?? లైవ్ వీడియో