OTT Movie: రాయలసీమలో కులం కోట్లాటలు ఇలా ఉంటాయా? ఓటీటీలోకి వచ్చేసిన రియల్ స్టోరీ

ఈ మధ్య కాలంలో రా అండ్ రస్టిక్ సినిమాలకు ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అందులోనూ నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా పెరుగుతోంది. ఇదే కోవలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన రియల్ స్టోరీనే ఇది.

OTT Movie: రాయలసీమలో కులం కోట్లాటలు ఇలా ఉంటాయా? ఓటీటీలోకి వచ్చేసిన రియల్ స్టోరీ
OTT Movie

Updated on: Mar 04, 2026 | 9:19 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైంది. ఇప్పటికే ఓం శాంతి శాంతి శాంతిః, విత్ లవ్, గాంధీ టాక్స్, తన్వి ది గ్రేట్ తదితర ఇంట్రెస్టింగ్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇప్పుడు ఇదే కోవలో మరో తెలుగు సినిమా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. రాయలసీమ ఫ్యాక్షనిజానికి కులం నేపథ్యాన్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. అయితే పేరున్న నటీనటులు లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో ఈ మూవీ లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. అయితే ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో దుమ్ము రేపుతున్నాయి. ఇప్పుడీ సినిమాకు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ మంచి రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. పూర్తిగా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఒక శక్తివంతమైన ఫ్యాక్షన్ కుటుంబం, వారి ప్రత్యర్థుల మధ్య జరిగే పోరాటమే ఈ మూవీ ప్రధానాంశం. వీరారెడ్డి అనే కరడుగట్టిన ఫ్యాక్షనిస్టుకు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటాడు ధర్మ. ఆ కుటుంబాన్ని శత్రువుల నుంచి కాపాడుతుంటాడు. వీరంతా ఒకే ఇంట్లోనే ఉన్నా ధర్మ కులం కారణంగా అందరూ అతనని వేరేలా చూస్తుంటారు.

ఎన్ని అవమానాలు ఎదురైనా తన తండ్ర కోసం ధర్మ అన్నిటినీ భరిస్తుంటాడు. వీరా రెడ్డి కుటుంబానికి అండగా నిలబడతాడు. కానీ ధర్మ ఆ పెద్దాయన కూతురు ప్రేమలో పడటంతో అసలు గొడవ మొదలవుతుంది. వీళ్ల ప్రేమ విషయం తెలిశాక ఊరిలో కల్లోలం మొదలవుతుంది. పాత పగలు, కులాల గొడవలు ఒక్కసారిగా పెద్దదవుతాయి. మరి ధర్మ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? అందుకు వీరా రెడ్డి ఒప్పుకున్నాడా? చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..

ఈ సినిమా పేరు దేవగుడి. బెల్లం రామకృష్ణారెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో రఘు కుంచె, అభినవ్ శౌర్య, అనుశ్రీ, నరసింహ, రఘుబాబు, రాకెట్ రాఘవ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా మంగళవారం (మార్చి 3) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ ఆడియన్స్ ని పలకరిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us