Unstoppable With NBK S2: పవర్ ఫైనల్ పార్ట్ 2 ప్రోమో వచ్చేసింది.. బాలయ్య ప్రశ్నలకు పవన్ రియాక్షన్

తాజాగా సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో మరిన్ని ఆసక్తికర విషయాలు ముచ్చటించారు బాలయ్య, పవన్.

Unstoppable With NBK S2: పవర్ ఫైనల్ పార్ట్ 2 ప్రోమో వచ్చేసింది.. బాలయ్య ప్రశ్నలకు పవన్ రియాక్షన్
Power Finale Part 2

Updated on: Feb 05, 2023 | 8:20 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటసింహం నందమూరి బాలాకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఆహా టీమ్. ఇప్పటికే మొదటి పార్ట్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. తాజాగా సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో మరిన్ని ఆసక్తికర విషయాలు ముచ్చటించారు బాలయ్య, పవన్. ముఖ్యంగా రెండో ఎపిసోడ్ లో రాజకీయ పరమైన ప్రశ్నలు సంధించారు బాలయ్య. ఆ ప్రశ్నలకు పవన్ ఎలాంటి సమాదానాలు చెప్పారు అన్నది ఆసక్తికరంగా మారింది.

పవన్ కారుపైకి ఎక్కి కూర్చున్న ఫోటోను చూపించి ప్రశ్నలు అడిగారు బాలయ్య. అలాగే తెలుగు దేశం పార్టీలో చేరవచ్చుగా అని కూడా అడిగారు. వాటితో పాటు రాష్ట్రంలో ఉన్న నీ ఫాన్స్ ఓట్లు ఎందుకు పడలేదు అనికూడా అడిగారు బాలయ్య.

ఈ ప్రశ్నలన్నిటికీ పవన్ తనదైన శైలిలో సమాదానాలు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే ఈ  ఎపిసోడ్ లో దర్శకుడు క్రిష్ కూడా హాజరయ్యారు. పవన్ క్రిష్ తో కలిసి హరిహర వీరమల్లు సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక సినిమాలు ఆపేసి రాజకీయాల్లో పవన్ కొనసాగాలి అని మీరు అనుకుంటున్నారా అని ప్రేక్షకులను అడగ్గా అందరు అవును అంటూ సమాధానం చెప్పినట్టు చూపించారు ఈ ప్రోమోలో.. అలాగే ఒక అవ్వ .. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకోవడం.. పవన్ ను సీఎం చూసిన తర్వాత చనిపోతానని చెప్పడంతో పవన్ ఆమె కళ్ళకు దండం పెట్టారు. ఈ ప్రోమోలో చూడొచ్చు. చివరిగా బాలకృష్ణ చెప్పిన డైలాగుకు పవన్ ఫిదా అయ్యాడు. అణువును కూడా ఇరుకున పెడితే అది అణుబాంబు అవుతుంది అని బాలయ్య అదిరిపోయే డైలాగ్ చెప్పారు.