Cinema OTT: ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ సందడి.. శుక్రవారం ఒక్క రోజే 14 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్..
ఈ వారాంతంలో ఓటీటీ ప్రేమికులకు భారీ వినోదం కాచుకొని ఉంది. శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 14కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగుపెడుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, ఆహా వంటి వేదికల్లో వైవిధ్యమైన క్రైమ్ థ్రిల్లర్లు, రొమాంటిక్ డ్రామాలు సందడి చేస్తున్నాయి. మీ ఫేవరెట్ సినిమాలతో ఈ వీకెండ్ బింజ్ వాచింగ్‌ను ఎంజాయ్ చేయండి!

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. డిజిటల్ యుగంలో వారాంతం వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ చూపు అంతా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వైపే ఉంటుంది. వారం అంతా పనులతో అలసిపోయిన సినిమా ప్రేమికులను అలరించేందుకు వినోద వేదికలు సిద్ధమయ్యాయి. ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద చిన్న, మీడియం రేంజ్ సినిమాలు సందడి చేస్తుండగా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం కంటెంట్ సునామీ రాబోతోంది. ఒక్క రోజే ఏకంగా 14కి పైగా సినిమాలు, డిఫరెంట్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తుండటంతో వీకెండ్ బింజ్ వాచింగ్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ వారం థియేటర్లలో శ్రీ విష్ణు నటించిన ‘కామ్రేడ్ కల్యాణ్’, రీసెంట్ సెన్సేషనల్ హిట్ ‘హనుమాన్ అంశ్’ (తెలుగు) చిత్రాలతో పాటు మయూఖ, బా..బా.. బ్లాక్ షీప్ వంటి విభిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే థియేటర్ల సందడి ఒకెత్తయితే, ఓటీటీలలో వస్తున్న వైవిధ్యమైన కంటెంట్ మరొక ఎత్తు. ప్రాంతీయ చిత్రాలతో పాటు హాలీవుడ్, కొరియన్ డబ్బింగ్ కంటెంట్‌కు ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ నెలకొంది.
కోలీవుడ్, టాలీవుడ్ కాంబినేషన్‌లో తమిళ నటుడు సూరి, తెలుగు హీరో సుహాస్ కాంబోలో వచ్చి థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన మండాడి చిత్రం డిజిటల్‌లోకి అడుగుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఎపిక్ తెలుగు నేరుగా విడుదలవుతున్న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అమెజాన్ ప్రైమ్
- పారిస్ కేఫ్(తమిళం)- అక్టోబర్ 09
- ఖలీఫా(మలయాళం)- అక్టోబర్ 09
నెట్‌ఫ్లిక్స్
- ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబర్ 09
- ఎపిక్ (తెలుగు) – అక్టోబర్ 09
- రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 09
- టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (కొరియన్ సిరీస్) – అక్టోబర్ 09
- యానిమల్స్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 09
- హాంటెడ్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 09
- డాక్టర్ ఎక్స్(కొరియన్ సిరీస్)- అక్టోబర్ 09
- 100 డేస్ ఆఫ్ డిసెప్షన్ (కొరియన్ సిరీస్) – అక్టోబర్ 10
జియో హాట్‌స్టార్
- షెరిఫ్ కంట్రీ సీజన్ 2 (ఇంగ్లీష్) – అక్టోబర్ 09
- పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2 (హిందీ) – అక్టోబర్ 10
- విజయనగర్ హిరే (బెంగాలీ) – అక్టోబర్ 10
- ట్రెజర్ ఐలాండ్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 11
సోనీ లివ్
ఐస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 09
