ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’ సినిమాతో థియేటర్లకు వచ్చిన బాలయ్య సింహగర్జన చేశారు. జనవరి 12న పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 130 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ కొల్లగొట్టాడు బాలయ్య. ఈ మూవీ ఓటీటీలో మరోసారి చూసేందుకు ఇటు బాలయ్య ఫ్యాన్స్, అటు మాస్ ఆడియెన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా అందుకు ముహూర్తం ఫిక్సయ్యింది. ఫిబ్రవరి 23 సాయంత్రం 6 గంటల నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక స్ట్రీమింగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను దాదాపు 15 కోట్లకు సొంతం చేసుకుంది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.
Seema Simham vetaa shuru??#VeeraSimhaReddyOnHotstar premieres @ 6 PM on February 23 only on #DisneyPlusHotstar
It’s time for #VSRHungamaOnHotstar! Ready na? pic.twitter.com/hfMMJ6jROX
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 12, 2023
బాలకృష్ణ డ్యూయల్ చేసిన ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేవారు. ఫ్యాక్షనిజం లేకుండా చేసి రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపించాలని నమ్మిన వీరసింహారెడ్డి అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో బాలయ్య నటించారు. ఇందులో డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సులు, బాలయ్య డ్యాన్స్ హైలెట్ అని చెప్పాలి. శృతిహాసన్, హనీ రోజ్ బాలయ్య సరసన నటించారు. బాలకృష్ణ సోదరిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ మెప్పించారు. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రలో నటించారు. ఇక ప్రజంట్ బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..