
ప్రస్తుతం, రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది, ఇందులో రణ్‌వీర్‌తో పాటు, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇండియాలో వెయ్యి కోట్ల వైపు వేగంగా పరుగులు తీస్తోన్న ధురంధర్ మూవీ పాకిస్తాన్‌లో కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. వాస్తవానికి ఈ సినిమాపై పాకిస్తాన్‌లో నిషేధం ఉంది.అయినప్పటికీ అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం, ఈ సినిమా విడుదలైన కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్‌లో 2 మిలియన్లకు పైగా ఇల్లీగల్ డౌన్‌లోడ్లు నమోదయ్యాయని అంచనా. తద్వారా గత 20 ఏళ్లలో పాకిస్తాన్‌లో అత్యధిక మంది చూసిన పైరేటెడ్ బాలీవుడ్ చిత్రంగా రణ్ వీర్ సింగ్ ధురంధర్ సినిమా రికార్డుల కెక్కింది. ఇంతలో OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పాకిస్తాన్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న టాప్ 10 సినిమాల జాబితాను ప్రకటించింది. ఆసక్తికరంగా, ఇందులో నాలుగు భారతీయ సినిమాలు ఉన్నాయి. అందులోనూ ఒక తెలుగు సినిమా ఏకంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
పాకిస్తాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది వీక్షించిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగుతో హిందీ, తమిళ్, కన్నడం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు పాకిస్తాన్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. నవంబర్ 7, 2025న థియేటర్లలో విడుదలైన రష్మిక చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’, పాకిస్తాన్‌లో రికార్డులు బద్దలు కొతుతోంది. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది చూసిన సినిమాగా
ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
#TheGirlfriend pic.twitter.com/m5GbZOPzA2
— Abhishek (@theKANPURIA) December 23, 2025
నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం పాకిస్తాన్‌లోని OTT ప్లాట్‌ఫామ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించింది. ఆమెతో పాటు, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 27.75 కోట్లు వసూలు చేసింది.
#TheGirlFriend (Telugu) streaming from Tonight on Netflix in Telugu, Tamil, Kannada Malayalam & Hindi🍿!!#OTT_Trackers pic.twitter.com/E8rpb7Vndr
— OTT Trackers (@OTT_Trackers) December 4, 2025
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.
When you don’t take a break, life breaks you 💔 pic.twitter.com/ra3WQqyvDl
— Netflix India South (@Netflix_INSouth) December 3, 2025