Annapoorani OTT: కాంట్రవర్సీ సినిమా.. ఆ ఓటీటీ డిలీట్.. ఇటు కొత్త ఓటీటీలో నయనతార మూవీ స్ట్రీమింగ్..

| Edited By: Basha Shek

Jan 11, 2024 | 9:30 PM

ఇందులోని కొన్ని డైలాగ్స్.. సన్నివేశాలు హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఈ సినిమా ఉందంటూ శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలపై.. ప్రస్తుతం స్ట్రీమింగ్ చేస్తోన్న ఓటీటీ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అటు విశ్వహిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ సైతం అన్నపూరణి సినిమాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Annapoorani OTT: కాంట్రవర్సీ సినిమా.. ఆ ఓటీటీ డిలీట్.. ఇటు కొత్త ఓటీటీలో నయనతార మూవీ స్ట్రీమింగ్..
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంట్రావర్సీ సినిమా అన్నపూరణి గురించే చర్చ నడుస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఈ మూవీ పలు వివాదాలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని కొన్ని డైలాగ్స్.. సన్నివేశాలు హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఈ సినిమా ఉందంటూ శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలపై.. ప్రస్తుతం స్ట్రీమింగ్ చేస్తోన్న ఓటీటీ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అటు విశ్వహిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ సైతం అన్నపూరణి సినిమాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులోని పలు డైలాగ్స్ హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. ఓటీటీ నుంచి ఈ చిత్రాన్ని తక్షణమే తొలగించాలని అన్నారు. దీంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంపై ఈ చిత్రాన్ని తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించింది.

అయితే ఉన్నట్లుండి అన్నపూరణి సినిమాను డిలీట్ చేయడంపై ఓవైపు విమర్శలు వస్తుండగా.. మరోవైపు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అన్నపూరణి సినిమా మరో ఓటీటీ ప్లాట్ ఫాంలోకి అందుబాటులోకి వచ్చేసింది. సౌత్ ఇండియన్ సినిమాలకు చెందిన ప్రముఖ ఓటీటీ దిగ్గజం సింప్లీ సౌత్ (Simply South)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ కాంట్రావర్సీ మూవీ సింప్లీ సౌత్ లో చూడొచ్చు.

ఈ సినిమా విషయానికి వస్తే.. బ్రహ్మాణ కుటుంబంలో జన్మించిన అమ్మాయికి చెఫ్ కావాలనే కోరిక ఉంటుంది. చిన్నప్పటి నుంచి మంచి చెఫ్ కావాలని అనుకుంటుంది. కానీ బ్రహ్మాణ అమ్మాయి చెఫ్ కావడం.. మాంసాన్ని ముట్టుకోవడం.. వండడం అనేది పెద్ద సవాళ్లు. ఈ క్రమంలో తనకు ఎదురైన పరిస్థితులను అన్నపూరణి ఎలా ఎదుర్కొంది ? చివరకు తన కలను ఎలా సాధ్యం చేసుకుంది అనేది ? ఈ సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.