
ఈ శుక్రవారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. ది ఒడిస్సీ, ప్రేమనే ఊరిలో, కికూ చిరంజీవి, కల్ట్, అనుపమ క్రేజీ కల్యాణం, అన్బిల్ అవన్, హైకూ, అనుమాన పక్షి, చిరం, 418, మయూఖ వంటి సినిమాలతో పాటు పలు ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. అయితే వీటి కంటే ముందే ఓటీటీలోకి వచ్చిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. భారీ స్ట్రీమింగ్ వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇదొక తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కొన్ని నెలల క్రితమే థియేటర్లలో విడుదలైంది. కంటెంట్ కొత్తగా ఉన్నా స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై పెద్దగా ఆడలేదు. అయితే థియేట్రికల్ రిలీజ్ చాలా రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా ఇప్పుడు ఆడియెన్స్ మెప్పు పొందుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది. ఒక దట్టమైన అడవి నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. సీత అనే ఒక మహిళ తన కుటుంబం, సంప్రదాయాలు, సామాజిక విలువలను గౌరవిస్తూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటుంది. అయితే అనుకోకుండా జరిగిన కొన్ని ఘటనలతో ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. ఉన్నట్లుండి భర్త కనిపించకుండా పోతాడు. ఇదే క్రమంలో ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకున్న సురుళి అనే వ్యక్తి ఆమె జీవితంలోకి వస్తాడు. వీరిద్దరూ కలిసి ఉండగానే సీత జీవితంలోకి మళ్లీ భర్త వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?పగ, విషాదం మధ్య ముగ్గురి జీవితం ఎలా మలుపులు తీసుకుంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు సాయవనం (Saayavanam). ఇదిక సైకలాజికల్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. అనిల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సీత పాత్రలో దేవనంద షాజిలాల్ , భర్త ముత్తు పాత్రలో సౌందర రాజా నటించారు. వీరితో పాటు సంతోష్ దామోదరన్, అప్పుకుట్టి, జానకి జయరామన్, వెట్రివేల్ రాజా, మాథ్యూ మాంప్రా తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. డామర్ సినిమా బ్యానర్‌పై సంతోష్ దామోదరన్ ఈ సినిమాను నిర్మించారు. పాలీ వర్గీస్ సంగీతం అందించారు. ప్రస్తుతం సాయవనం సినిమా ప్రముఖ ఓటీటీ తెలుగు ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.