
మిర్జాపూర్.. ఓటీటీ ప్లాట్ ఫామ్లో పూర్తిగా నెగిటివిటీ మూటకట్టుకున్న సిరీస్. దీనిని బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కానీ ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాత్రం ఇప్పుడు మూడో సీజన్ వరకు చేరింది. త్వరలోనే మిర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సిరీస్ జూన్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా నిన్న మీర్జాపూర్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రసిక దుగ్గల్, శ్వేతా త్రిపాఠి, విజయ్ వర్మ కీలకపాత్రలు పోషించారు. ఇందులో పంకజ్ త్రిపాఠి పాత్ర కాలీన్ భయ్యా భార్య బీనా త్రిపాఠి పాత్రలో బాలీవుడ్ నటి రసిక దుగ్గల్ కనిపించింది. ఇందులో రసిక బోల్డ్ సన్నివేశాల్లో కనిపించింది.
మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో రసిక బోల్డ్ పాత్రలో నటించిన మెప్పించింది. ఇందులో ఆమె నటనకు అడియన్స్ ఫిదా అయిపోయారు. గత రెండు సీజన్లలోనూ రసిక తనదైన నటననతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు మరోసారి సీజన్ 3లోనూ అలరించేందుకు రెడీ అయ్యింది. మీర్జాపూర్ సిరీస్ లో కనిపించినట్లుగానే నెట్టింట కూడా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోలతో తెగ హంగామా చేస్తుంది. నిత్యం మోడ్రన్ లుక్ ఫోటోషూట్స్ అంటూ సందడి చేస్తుంది. తాజాగా రషిక చేసిన పోస్టులు నెట్టింట వైరలవుతున్నాయి.
రసిక దుగ్గల్.. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో జన్మించింది. ఢిల్లీ లేడీ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చేసింది. 2007లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రసిక మీర్జాపూర్ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యింది. మేడెన్ హెవెన్, ఢిల్లీ క్రైమ్, ఆఫ్ ఆఫ్ లవ్, ఓకే కంప్యూటర్ వంటి వెబ్ సిరీస్ చేసింది. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన రసిక.. నో స్మోకింగ్, హైజాక్, తాహన్, అగ్యాత్ వంటి రోల్స్ లో కనిపించింది. మీర్జాపూర్ సీరిస్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రసిక మాట్లాడుతూ.. తాను ఎన్నో అవమానాలు, తిరస్కరణలను ఎదుర్కొన్నానని.. ఆఫర్స్ కోసం ఎంతమందిని సాయం అడిగినట్లు తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 14 సినిమాల్లో నటించానని.. అందులో ఒకటి లేదా రెండు సన్నివేశాలు అలాంటివే వచ్చాయని తెలిపింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.