Waltair Veerayya: అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది.. ఓటీటీలోకి మెగాస్టార్‌ వాల్తేరు వీరయ్య.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌

|

Feb 27, 2023 | 2:58 AM

థియేటర్లో బ్లాక్‌ బస్టర్‌ బొమ్మగా నిలిచిన వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షిణకు తెరపడింది. మెగాస్టార్‌- మాస్‌ మహరాజాల మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Waltair Veerayya: అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది.. ఓటీటీలోకి మెగాస్టార్‌ వాల్తేరు వీరయ్య.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌
Waltair Veerayya Ott
Follow us on

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన మెగా మల్టీస్టారర్‌ మూవీ వాల్తేరు వీరయ్య. కే.ఎస్‌.రవీంద్ర (బాబీ) తెరకెక్కించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే క్యాథరీన్‌ థెరిస్సా ఓ కీలక పాత్రలో కనిపించింది. బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సుమారు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంక్రాంతి విజేతగా నిలిచింది. కాగా థియేటర్లో బ్లాక్‌ బస్టర్‌ బొమ్మగా నిలిచిన వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. మెగాస్టార్‌- మాస్‌ మహరాజాల మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. వాల్తేరు వీరయ్య డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మెగా బ్లాక్‌ బస్టర్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా తెలిపింది.

కాగా సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో పాటు బాలయ్య వీరసింహారెడ్డి, అజిత్‌ తునివు, విజయ్‌ దళపతి వారసుడు సినిమాలు పోటీపడ్డాయి. వీటిలో అజిత్‌ తునివు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగానే స్ట్రీమింగ్‌ కానుంది. కాగా వాల్తేరు వీరయ్య సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, బాబీసింహా, రాజేంద్ర ప్రసాద్‌, నాజర్‌, సత్యరాజ్‌, వెన్నెల కిశోర్‌, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్‌, సుబ్బరాజు, సప్తగిరి తదితరలు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ నిర్మించింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన మాస్ బీట్స్ ఛార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..