Marco on OTT: ‘ఆహా’లోకి వచ్చేస్తున్న 100 కోట్లు కొల్లగొట్టిన వయిలెంట్ ఫిల్మ్ మార్కో…

మలయాళ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘మార్కో’ త్వరలో ఆహా ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. 2024 డిసెంబరు 20న కేరళలో విడుదలై బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది మారకో. దీంతో జనవరి 1న ‘మార్కో’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేశారు. ఇక్కడ కూడా సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది. తాజాగా అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలోకి ఎంటరవ్వబోతుంది మార్కో.

Marco on OTT: ఆహాలోకి వచ్చేస్తున్న 100 కోట్లు కొల్లగొట్టిన వయిలెంట్ ఫిల్మ్ మార్కో...
Marco Movie

Updated on: Feb 16, 2025 | 12:27 PM

ఉన్ని ముకుందన్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఈ నెల 21వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది ఓవర్సీస్‌లో ఈ నెల 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు వస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు హనీఫ్ అడేని రూపొందించారు. క్యూబ్ ఎంటర్ టైన్ మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.

ఉన్ని ముకుందన్ తో పాటు సిద్ధిక్, జగదీష్, అభిమన్యు ఎస్ తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ రిలీజ్ మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించింది. మార్కో తెలుగులోనూ రిలీజై ఘన విజయాన్ని అందుకుంది. ఆహా ఓటీటీ ద్వారా మార్కో సినిమా మరింతమంది మూవీ లవర్స్ కు రీచ్ కానుంది. ఆహాలో  తెలుగు వెర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ సినిమాలో ర‌క్తపాతం స‌న్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. వయిలెన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాడు చిత్ర దర్శకుడు. పాట‌లు, రొమాంటిక్ సీన్స్ అస్సలు కనిపించవు. టెక్నికల్ అంశాల విషయంలో తిరుగులేదు. అయితే యాక్షన్‌ ప్రియుల‌ను సైతం నిర్ఘాంతపోయేలా అమ్మ బాబోయ్ అనేలా చేస్తాయి ఈ సినిమాలో సెకండాఫ్ సన్నివేశాలు. ఆద్యంతం రక్తపాతమే ఉంటుంది. ఉన్ని ముకుంద‌న్ తెర‌పై స్టైలిష్‌గా క‌నిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.