OTT Movie: 5 కోట్లతో తీస్తే 50 కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు.. తెలుగులోనూ మలయాళం థ్రిల్లర్

కొన్ని నెలల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇటీవలే ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాగా ఇక్కడ కూడా రికార్డులు కొల్లగొడుతోంది. ఐఎమ్ డీబీలో ఈ మూవీకి 8.1 రేటింగ్ ఉండడం విశేషం.

OTT Movie: 5 కోట్లతో తీస్తే 50 కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు.. తెలుగులోనూ మలయాళం థ్రిల్లర్
EKO Movie

Updated on: Jan 05, 2026 | 6:42 PM

ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో మలయాళం థ్రిల్లర్లకు మంచి క్రేజ్ ఉంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ మాలీవుడ్ సినిమాలను తెగ చూసేస్తున్నారు. అలా ఇప్పుడు ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండడంతో తెలుగు ఆడియెన్స్ కూడా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మలయాళం ఆడియెన్స్ ను అమితంగా అలరించింది. సరికొత్త కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే..

కేరళ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓ అడవిలో ఈ సినిమా కథ సాగుతుంది. అక్కడ కురియాచన్ అనే ఓ వ్యక్తికి ఒక పెద్ద ఎస్టేట్ ఉంటుంది. అక్కడే మలేషియన్ బ్రీడ్ కుక్కలను పెంచుతుంటాడు. అయితే ఉన్నట్లుండి కురియాచన్ కనిపించకుండా పోతాడు. ఒకరిని హత్య చేయడంతో పాటు చాలా మందిని మోసం చేసి కురియాచన్ పారిపోయాడని ప్రచారం జరుగుతుంది. అతనిని వెతుక్కుంటూ పోలీసులతో పాటు చాలా మంది వస్తారు. మరి కురియాచన్ ఎక్కడికి వెళ్లాడు? అతని కథ ఏంటీ? ఎస్టేట్ లోని రహస్యాలు ఏంటీ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఎకో సినిమాపై ఓ నెటిజన్ రివ్యూ..

ఆద్యంతం ఎంగేజింగ్ గా సాగే ఈ మూవీ పేరు ఎకో. దినజిత్ అయ్యతన్ తెరకెక్కించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో వినీత్, సందీప్ ప్రదీప్, బియానా, నరైన్, సౌరభ్ సచ్ దేవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంది. మంచి మిస్టరీ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఎకో ది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .