
ఎప్పటిలాగే ఈ వారం కూడా బోలెడన్నీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేయనున్నాయి. అయితే గత వారం వచ్చిన ఓటీటీలోకి వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఆడియెన్స్ ను తెగ భయపెడుతోంది. ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠకలిగించే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఇప్పుడదే ఎక్స్ పీరియెన్స్ ఓటీటీ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా కథ ముగ్గురు కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. ముగ్గురూ కలిసి ఒక పాత కాలపు బిల్డింగ్‌లో ఉన్న హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. అయితే ఆ హాస్టల్ బిల్డింగ్ పక్కనే ఒక పాత శ్మశాన వాటిక ఉంటుంది. ఆ శ్మశాన వాటిక నుంచి ఆత్మ తమ హాస్టల్‌లోకి వస్తోందని, తమ చుట్టూ ఏదో జరుగుతోందని ఆ ముగ్గురు స్నేహితులు తెగ భయపడిపోతుంటారు. ఆ భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఆ ముగ్గురు కుర్రాళ్లు చేసే ప్రయత్నాలు, పడే ఇబ్బందులు ఆడియెన్స్ కు నవ్వులు తెప్పిస్తాయి. మరి అసలు ఆ శ్మశానవాటికలో ఉన్న రహస్యం ఏంటి? ఆ ఆత్మకు, ఆ హాస్టల్ ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ ఆత్మలు ఎవరివి? ముగ్గురు కుర్రాళ్లు వాటిని ఎదుర్కొన్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘కనిమంగళం కోవిలకం’. ఇదొక మలయాళం సినిమా. యూట్యూబ్‌లో సూపర్ హిట్ గా నిలిచిన ‘కనిమంగళం కోవిలకం’ వెబ్ సిరీస్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రూపొందింది. వెబ్ సిరీస్‌లో నటించిన అజ్మల్ ఖాన్, అబ్బి క్రిష్ తదితర మెయిన్ ఆర్టిస్టులే సినిమాలోనూ యాక్ట్ చేశారు.రాజేష్ మోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. క్లాప్‌బోర్డ్ ఫిల్మ్స్, బ్రిటిష్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. సుమారు 122 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు.
Aiyayooo Patti da
Kanimangalam Kovilakam streaming now on Sun NXT!
@raajeshmohan_official @haris_nova @jishnu_sankar @Ajmal_Khan_ @abbii.krish @rafidq @sudhi_surendran_ @sandra_chaandy
[kanimangalam kovilakam, malayalam horror comedy, spooky comedy movie, new ott release,… pic.twitter.com/9UC2UFBDZT
— SUN NXT (@sunnxt) April 13, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.