
వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో మలయాళీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ వరకు ప్రతి సినిమాను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో మలయళీ చిత్రాలు తెలుగులో విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ హిట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా పేరు సర్వం మాయ. జనవరి 30 నుంచి ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించగా.. హారర్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఎక్కువమంది చదివినవి : Actress Rohini: రఘువరన్తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..
సర్వం మాయ.. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే మూవీ జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి IMDBలో 8 రేటింగ్ ఉండడం విశేషం. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమాకు అనుహ్య స్పందన వస్తుంది. ఈ చిత్రాన్ని కేవలం 30 కోట్లతో నిర్మిస్తే.. రూ.147 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఇందులో నివిన్, రియా షిబు, అజు వర్గీస్ తదితరులు నటించారు. ఇది డిసెంబర్ 25, 2025న థియేటర్లలో రిలీజైంది.
ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..
కథ విషయానికి వస్తే.. ప్రభేందు (నివిన్ పౌలీ ) ఓ బ్రహ్మాణ కుటుంబానికి చెందిన యువకుడు. నాస్తికుడు కావడంతో దేవుళ్లను అంతగా నమ్మడు. తండ్రితో గొడవపడి ఇంటికి దూరంగా ఉంటారు. యూరోప్ వెళ్లాలని కలలు కంటాడు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఇవేమి సాధ్యం కాదు. తన సోదరుడితో కలిసి ఒక పూజారి దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. వీళ్లు ఒక దెయ్యాన్ని వదిలించే పూజా చేయాల్సి వస్తుంది. అక్కడే కథలో మలుపు తిరుగుతుంది. మాయ అనే దెయ్యం తాను ఎలా చనిపోయిందనే విషయం తనకు గుర్తుండదు. దీంతో ఆమెకు సాయం చేస్తాడు ప్రభేందు జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది సినిమా.
ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..