MAD movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘మ్యాడ్’.. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఎక్కడ చూడొచ్చంటే..

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన జాతి రత్నాలు సినిమా తర్వాత ఆ స్థాయిలో మరోసారి అడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన చిత్రం ఇది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యా్నర్ పై ఈ సినిమాను నిర్మించగా.. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే మజా ఏంటో చూపించారు. థియేటర్లలో కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

MAD movie: ఓటీటీలోకి వచ్చేసిన మ్యాడ్.. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఎక్కడ చూడొచ్చంటే..
Mad Movie

Updated on: Nov 03, 2023 | 3:12 PM

ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమా ‘మ్యాడ్’. సంగీత్ శోభన్, నితిన్ నార్నే, రామ్ నితిన్ నటించిన ఈ చిత్రం యూత్‏ను ఆకట్టుకుంది. కోవిడ్ లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన జాతి రత్నాలు సినిమా తర్వాత ఆ స్థాయిలో మరోసారి అడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన చిత్రం ఇది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యా్నర్ పై ఈ సినిమాను నిర్మించగా.. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే మజా ఏంటో చూపించారు. థియేటర్లలో కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నవంబర్ 3 నుంచి ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమాలో గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యాన్ కీలకపాత్రలు పోషించగా.. బలగం సినిమాకు సంగీతం అందించిన భీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అటు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ మ్యాడ్ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

కథ విషయానికి వస్తే..

మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్).. ముగ్గురూ రాయల్ ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు. వీరు బాస్కెట్ బాల్ పోటీలలో స్నేహితులుగా మారతారు. ఇందులో మనోజ్ శ్రుతి (గౌరి ప్రియ) అనే అమ్మాయిని మనోజ్ ప్రేమిస్తుంటాడు. జెన్నీ (అనంతిక) అనే అమ్మాయి అశోక్ ను ప్రేమిస్తుంటుంది. వీరిలో దామోదర్ కు ఓ అమ్మాయి నుంచి ప్రేమ లేఖ రావడం.. ఆమెను చూడకుండానే ప్రేమలో పడిపోవడం.. అలా నాలుగేళ్ల తర్వాత ఆ అమ్మాయి కోసం హాస్టల్ కు వెళ్లగా.. అక్కడ ఓ నిజం తెలుస్తోంది. ఆ నిజం ఏంటీ ?.. ఆ తర్వాత ఈ ముగ్గురు స్నేహితులు ఎదుర్కోన్న సమస్యలు ఏంటీ అనేది సినిమా .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.