Telugu News Entertainment Ott List Of New Movies And Web Series Streaming On OTT Platforms On July 14th Telugu Cinema News
OTT Movies: ఓటీటీ లవర్స్‌కు పండగే.. శుక్రవారం ఒక్కరోజే 19 కొత్త సినిమాల రిలీజ్.. ఫుల్ లిస్ట్ ఇదే
ఓటీటీల్లో కూడా బోలెడన్నీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం (జులై 14) ఒక్క రోజే సుమారు 19 సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో తెలుగు సినిమాలు, సిరీస్‌లు కూడా ఉన్నాయి.
వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే ఇందులో బేబీ తప్ప మిగతావన్నీ డబ్బింగ్ సినిమాలే. నాయకుడు (మామన్నన్), శివకార్తికేయన్ వంటి డబ్బింగ్ సినిమాలు ఈ వారం థియేటర్లలో అడుగుపెడుతున్నాయి. ఇక ఓటీటీల్లో కూడా బోలెడన్నీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం (జులై 14) ఒక్క రోజే సుమారు 19 సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో తెలుగు సినిమాలు, సిరీస్‌లు కూడా ఉన్నాయి. అలాగే హిందీ, తమిళ్, మలయాళ, ఇంగ్లిష్ తదితర భాషల సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు కూడా ఓటీటీలోకి రానున్నాయి. మరి వాటి వివరాలేంటో తెలుసుకుందాం రండి