Telugu Indian Idol: అభిమానులకే అవకాశం.. తెలుగు ఇండియన్ ఐడల్ కోసం ఆహా సరికొత్త నిర్ణయం

|

Jun 02, 2022 | 4:30 PM

100 శాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను అనుకుంటుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా(Aha). సూపర్ హిట్ సినిమాలను,

Telugu Indian Idol: అభిమానులకే అవకాశం.. తెలుగు ఇండియన్ ఐడల్ కోసం ఆహా సరికొత్త నిర్ణయం
Aha
Follow us on

100 శాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను అనుకుంటుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా(Aha). సూపర్ హిట్ సినిమాలను, ఆసక్తికర వెం సిరీస్ లు, ఆకట్టుకునే గేమ్ షోలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుది ఆహా . సంగీతం అంటే తెలుగు ఇండియన్ ఐడల్((Telugu Indian Idol)లోని స్వరాలూ అనేలా ప్రఖ్యాతి గాంచింది తెలుగు ఇండియన్ ఐడల్. తెలుగు ఇండియన్ ఐడల్ షో తుది అంకానికి చేరుకోబోతుంది. ఆరుగురు కంటెస్టెంట్స్ ఫినాలేకు చేరుకున్నారు . శ్రీనివాస్, జయంత్, వాగ్దేవి, ప్రణతి, లాలస, వైష్ణవి కంటెస్టెంట్స్ సెమి ఫినాలేకు చేరుకున్నారు. ఈ జూన్ 3 న 15 వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి అంకానికి చేరుకుంది. ప్రేక్షకులకు నచ్చిన కంటెస్టెంట్స్ ను గెలిపించుకోవటానికి ఆహా చివరి అవకాశం కల్పించింది.

జూన్ 3 నుండి జూన్ 6  ఉదయం 7 గంటల వరకు ప్రేక్షకులకు నచ్చిన వారికి ఓటు వేసి గెలిపించుకోవచ్చు. మనకు నచ్చిన గొంతును మొట్టమొదటి తెలుగు ఇండియన్ ఐడల్ గా నిలబెట్టే అవకాశం కల్పించింది. ఈ వారం ఆహా అభిమానులందరిని అలరించడానికి లెజండరీ సింగర్ ఉష ఉతప్ప గెస్ట్ గా హాజరుకానున్నారు. కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ తో పాటు ఉష ఉతప్ప సంగీతంలో మైమరిచిపోవడానికి ఈ శుక్రవారం సిద్ధంగా ఉండండి అని ఆహా తెలిపింది.

ఇవి కూడా చదవండి