Murder in Mahim OTT: ఓటీటీలోకి వస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

క్రైమ్, ఇన్వెస్టిగేషన్, ఉత్కంఠ, ట్విస్టులు కలిగిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అదే 'మర్డర్ ఇన్ మహిమ్'. సైకలాజికల్ క్రైమ్ వెబ్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సిరీస్ లో విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివానీ రఘువంశీ ప్రధాన పాత్రలు పోషించారు.

Murder in Mahim OTT: ఓటీటీలోకి వస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Murder In Mahim

Updated on: May 07, 2024 | 4:53 PM

మండుటెండల్లో చల్లనైనా వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. లవ్, యాక్షన్, మాస్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ తరహా చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఆయా ఓటీటీల్లో అనేక చిత్రాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై హారర్, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ కు మంచి క్రేజ్ వస్తుంది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్, ఉత్కంఠ, ట్విస్టులు కలిగిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అదే ‘మర్డర్ ఇన్ మహిమ్’. సైకలాజికల్ క్రైమ్ వెబ్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సిరీస్ లో విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివానీ రఘువంశీ ప్రధాన పాత్రలు పోషించారు.

తాజాగా ఈ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. మర్డర్ ఇన్ మహిమ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మే 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ కూడా సిరీస్ పై ఆసక్తిని కలిగించింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, బెంగాళీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు రాజ్ ఆచార్య దర్శకత్వం వహించారు. ముంబైలోని మహిమ్ అనే రైల్వే స్టేషన్లో జరిగే ఓ యువకుడి మర్డర్ మిస్టరీని ఛేదించడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. 2013 బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ ఉంటుంది. ఈ హత్య కేసును విచారించే పీటర్ (అషుతోశ్ రాణా) కుమారుడే ఈ కేసులో అనుమానితుడిగా ఉండడంతో ఈ మర్డర్ మిస్టరీ సిరీస్ ఆసక్తిగా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.