
ఇటీవల కాలంలో ఓటీటీలో సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అటు థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు.. కేవలం 45 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ ఒక సినిమా మాత్రం ఇప్పటికీ చెరగని రికార్డ్ సొంతం చేసుకుంది. థియేటర్లలో తుఫాను సృష్టించిన మూవీ.. ఇప్పటికీ ఓటీటీలో దూసుకుపోతుంది. పుష్ప 2, ధురంధర్ వంటి చిత్రాలు సైతం ఆ మూవీ రికార్డ్ బద్దలుకొట్టలేకపోయాయి. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ లో ఆ మూవీ దూసుకుపోతుంది. దాదాపు 2 గంటల 41 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా విడుదలై 9 సంవత్సరాలు గడుస్తుంది. అయినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. టీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు సైతం ఆ మూవీ రికార్డును బద్దలు కొట్టలేకపోయాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. సోషల్ మీడియాలోనూ దీనిపై తీవ్ర చర్చ నడుస్తుంది.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
9 సంవత్సరాల తర్వాత కూడా నెట్‌ఫ్లిక్స్‌ను ఏలుతున్న సినిమా పేరు దంగల్. అమీర్ ఖాన్ నటించిన ఈ మూవీ 2016లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. పుష్ప 2, ధురంధర్ వంటి ప్రముఖ చిత్రాలను కూడా అధిగమించి దంగల్ టాప్ 10లో నిలిచింది. తన కూతుర్లను ప్రతిభావంతులైన రెజ్లర్స్ గా మార్చేందుకు ఓ తండ్రి పడిన ఆరాటమే ఈ సినిమా.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్, అతని కుమార్తెలు గీతా ఫోగట్, బబితా ఫోగట్ జీవితం ఆధారంగా దంగల్ చిత్రం తెరకెక్కించారు. ఒక తండ్రి సమాజ నియమాలకు వ్యతిరేకంగా ఎలా పోరాడుతాడు.. ? తన కుమార్తెలకు రెజ్లింగ్ రంగంలో ఎలా శిక్షణ ఇచ్చాడు.. ? అనేది చూపిస్తుంది. కూతుళ్ల పోరాటం, తండ్రి కఠినమైన క్రమశిక్షణ, విజయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో అమీర్ ఖాన్ నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. స్టార్ హీరో అయినప్పటికీ హీరోయిజం చిత్రాలు కాకుండా ఇద్దరు కూతుర్లకు తండ్రిగా .. అద్భుతమైన నటనతో కట్టిపడేశారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..