OTT Movie: అమ్మాయిలను అతి కిరాతకంగా హతమార్చే సైకో కిల్లర్.. పిల్లలతో కలిసి మా సినిమాను చూడొద్దన్న హీరో

కొన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో సన్నివేశాలు మరీ భయానకంగా ఉంటాయి. అందుకే సెన్సార్ బోర్డ్ ముందుగానే ఇలాంటి సినిమాలకు ఏ సర్టిఫికెట్ ఇస్తుంది. అయితే ఈ సినిమాను మీ పిల్లలతో కలిసి చూడొద్దని స్వయంగా ఇందులో నటించిన స్టార్ హీరోనే ఆడియెన్స్ ను రిక్వెస్ట్ చేశాడు.

OTT Movie: అమ్మాయిలను అతి కిరాతకంగా హతమార్చే సైకో కిల్లర్.. పిల్లలతో కలిసి మా సినిమాను చూడొద్దన్న హీరో
OTT Movie

Updated on: Jul 01, 2025 | 8:07 PM

సైకో పాత్ సినిమాలు చూడడానికి చాలా భయంకరంగా అనిపిస్తాయి. అందుకే చాలా వరకు ఇలాంటి సినిమాలకు సర్టిఫికెట్ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. సినిమాలో ఒక సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత మారుస్తుంటాడు. పైగా వారి శరీరాలపైస్మైలీ ఫేస్ చెక్కుతాడు. దీంతో ఈ సైకో కిల్లర్‌ను స్మైలీ కిల్లర్ గా పిలుస్తారు. చెన్నై నగరంలో జరిగే అమ్మాయిల మర్డర్ల వెనక మిస్టరీని ఛేదించేందుకు అర్జున్ అనే ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంగంలోకి దిగుతాడు. అతనికి ఆండ్రూ అని క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు. ఇద్దరూ కలిసి సైకో పాత్ కిల్లర్ ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. చివరకు హత్యలన్నీ చేసేది బ్రహ్మ అని గుర్తిస్తారు. అతను తనను తాను గాడ్ గా పరిగణించుకుంటూ అమ్మాయిలను అతి కిరాతకంగా హత్య చేస్తుంటాడు. అయితే ఎట్టకేలకు అర్జున్, అండ్రూ కలిసి బ్రహ్మను పట్టుకుంటారు. కానీ సైకో కిల్లర్ ని పట్టుకునే క్రమంలో ఆండ్రూ దారుణంగా చనిపోతాడు.

ఇవి కూడా చదవండి

 

స్నేహితుడి మరణంతో అర్జున్ పోలీసు ఉద్యోగాన్ని వదిలేస్తాడు. ఆండ్రూ ఫ్యామిలీని చూసుకునేందుకు ఒక కాఫీ షాప్ రన్ చేస్తుంటాడు. కానీమరో వైపు బ్రహ్మా పోలీసు కస్టడీ నుండి తప్పించుకుంటాడు. మళ్లీ అమ్మాయిలను చంపడం ప్రారంభిస్తాడు. చివరకు అర్జున్ కుటుంబ సభ్యులనే టార్గెట్ చేస్తాడు. మరి బ్రహ్మ అమ్మాయిలను చంపడం వెనక మోటివ్ ఏంటి? అర్జున్ తన ఫ్యామిలీని కాపాడుకున్నాడా? బ్రహ్మ పోలీసులకు చిక్కాడా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఇరైవన్. తెలుగులో గాడ్ గా రిలీజైంది. జయం రవి, నయనతార హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

గాడ్ సినిమాలో ఓ సీన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..