Guntur Kaaram: ఇట్స్ అఫీషియల్.. గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే..

|

Feb 04, 2024 | 11:18 AM

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం సినిమా మొదట్లో మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఆతర్వాత రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించి వావ్ అనిపించింది. గుంటూరు కారం సినిమా ఏకంగా 250కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్ లో అదరగొట్టాడు. మహేష్ బాబు స్టైల్ కు, లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

Guntur Kaaram: ఇట్స్ అఫీషియల్.. గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే..
Gunturu Kaaram
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం సినిమా మొదట్లో మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఆతర్వాత రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించి వావ్ అనిపించింది. గుంటూరు కారం సినిమా ఏకంగా 250కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్ లో అదరగొట్టాడు. మహేష్ బాబు స్టైల్ కు, లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది.

గుంటూరు కారం సినిమా ఎలా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు ఎనర్జీ, డాన్స్ , డైలాగ్స్ అభిమానుల చేత విజిల్స్ కొట్టించాయి. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకోనుంది. సంక్రాంతికి రిలీజ్ అయినా సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. సైందవ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు గుంటూరు కారం సినిమా టైం వచ్చింది.

గతకొద్ది రోజులుగా గుంటూరు కారం సినిమా ఓటీటీ రిలీజ్ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థలో గుంటూరు కారం స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు గుంటూరు కారం సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 9న గుంటూరు కారం సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్. గుంటూరు కారం సినిమాకు తమన్ సంగీతం అందించారు.

గుంటూరు కారం ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..