Hunt: యాక్షన్ థ్రిల్లర్‌ ‘హంట్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడు..? ఎక్కడంటే..?

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 26న థియేటర్లలో విడుదలైంది. సుధీర్ బాబు, శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ ఇందులో కీ రోల్స్ పోషించారు.

Hunt: యాక్షన్ థ్రిల్లర్‌ హంట్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడు..? ఎక్కడంటే..?
Hunt Ott Release

Updated on: Feb 09, 2023 | 2:42 PM

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన హంట్ మూవీ ఇటీవల ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ మూవీకి మిక్స్డ్  టాక్ రావడంతో.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో  ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ విషయాన్ని ఆహా అఫీషియల్‌గా ప్రకటించింది.  అంటే శుక్రవారం ఎంటరయ్యాక మిడ్ నైట్ 12 గంటల తరవాత ‘ఆహా’లో ‘హంట్’ చూసెయ్యొచ్చు.

‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, హీరో శ్రీకాంత్ ఈ మూవీలో కీ రోల్స్ చేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ సినిమాను నిర్మించిన ఈ చిత్రాన్ని మహేష్ డైరెక్ట్ చేశాడు. ‘ముంబై పోలీస్’కు రీమేక్‌గా వచ్చిన ‘హంట్’ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా మంచిగానే చేశారు. సుధీర్ బాబు సైతం తన కెరీర్‌లో ఇదొక మంచి మూవీ అవుతుందని ఆశించారు. కానీ, ఫలితం రివ్సరయ్యింది. అందుకే థియేటర్లలో విడుదలయిన  15 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

మంజులా ఘట్టమనేని, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, మైమ్ గోపి, మౌనికా రెడ్డి, గోపరాజు రమణ, కబీర్ దుహన్ సింగ్  ‘జెమినీ’ సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ తదితరులు ఈ మూవీలో నటించారు. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్ కాగా వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లు రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్.. ‘హంట్’ లో స్టంట్స్ కంపోజ్ చేయడం విశేషం. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి  హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ బాగానే నచ్చుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.