ఊరించి.. ఊసురుమనించినట్లు.. అడివి శేష్ నటించిన ‘హిట్-2’ చిత్రాన్ని జనవరి 3వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో రెంటల్ ప్రాతిపదికన స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఏం జరిగిందో ఏంటో తెలియదు గానీ.. వెంటనే తన మూవీ క్యాటలాగ్ నుంచి దాన్ని తొలగించింది. ఇక ఇప్పుడు ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు ఓ అలర్ట్ వచ్చేసింది. ఇట్స్ అఫీషియల్.. జనవరి 6వ తేదీ నుంచి ప్రైమ్ వీడియో వేదికగా ‘హిట్-2’ ఉచితంగా ప్రసారం కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. ‘హిట్-2’లో అడివి శేష్ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషించగా.. దర్శకుడు శైలేష్ కొలను ఈ పార్ట్‌ను మొదటి దానికంటే మరింత థ్రిల్లింగ్‌గా తెరకెక్కించాడు. ఇందులో మీనాక్షీ చౌదరీ, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటించారు. ‘హిట్ ది ఫస్ట్ కేస్’ ఇది సీక్వెల్. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రావు రమేష్, ఆదర్శ్ బాలకృష్ణ, సుహాస్, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించగా.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై న్యాచురల్ స్టార్ నాని నిర్మించాడు.