AHA OTT: ఆహాలో మరో సూపర్‌హిట్‌ మూవీ.. ఫహద్‌ ఫాజిల్‌ మాలిక్‌ తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

Fahadh Faasil Malik: మలయాళ సినిమాలు చూసేవారికి ఫహద్‌ ఫాజిల్‌ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక అల్లు అర్జున్‌ పుష్ప సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడీ ట్యాలెంటెడ్‌ హీరో..

AHA OTT: ఆహాలో మరో సూపర్‌హిట్‌ మూవీ.. ఫహద్‌ ఫాజిల్‌ మాలిక్‌ తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Fahadh Faasil's Malik

Updated on: Jul 28, 2022 | 10:14 PM

Fahadh Faasil Malik: మలయాళ సినిమాలు చూసేవారికి ఫహద్‌ ఫాజిల్‌ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక అల్లు అర్జున్‌ పుష్ప సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడీ ట్యాలెంటెడ్‌ హీరో. కాగా ఆయన మలయాళంలో హీరోగా నటించిన చిత్రం మాలిక్‌. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలై సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా రెండు వేర్వేరు పాత్రల్లో కనిపించిన మాలిక్‌ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే వేర్వేరు భాషల్లో విజయం సాధించిన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా (AHA). ఇప్పుడు మాలిక్‌ సినిమా తెలుగు వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన ఆహా యాజమాన్యం స్ట్రీమింగ్‌ డేట్‌ను కూడా ఫిక్స్‌ చేసింది. ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది. కాగా మాలిక్‌ సినిమాలో ఫాహద్‌తో పాటు నిమిషా సంజయన్‌, వినయ్‌ ఫోర్ట్‌, జోజూ జార్జ్‌ తదితరులు, దిలీష్‌ పోతన్‌, ఇంద్రన్స్‌, సలీమ్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సజు వర్గీస్‌ సినిమాటోగ్రఫీ అందించగా.. మహేశ్‌ నారాయణన్‌ దర్శకత్వం వహించాడు. ఆంటో జోసెఫ్‌ నిర్మాతగా వ్యవహరించగా, సుశిన్‌ శ్యామ్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..