
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కాంత.సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే సముద్రఖని, దగ్గుబాటి రానా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.పాన్ ఇండియా ప్రాజెక్టుగా వచ్చిన ఈ మూవీ కేవలం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే ఓ వర్గం ఆడియెన్స్ కు కాంత సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ మూవీకి ఓ మోస్తరు వసూళ్లు వచ్చాయి. ఇప్పుడీ కాంత సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియాట్రిక్ రన్ క్లోజ్ కావడంతో నెలలోపే ఓటీటీ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో డిసెంబర్ 12న నెట్ ఫ్లిక్స్ లో కాంత సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారని సమాచారం. తెలుగు సహా దక్షిణాది భాషలన్నీ ఆ రోజే అందుబాటులోకి రానున్నాయి. అయితే హిందీ వెర్షన్ మాత్రం 8 వారాల తర్వాతే వస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
కాంత సినిమా కథ విషయానికి వస్తే.. 1950 బ్యాక్ డ్రాప్‌లో జరిగే కథ ఇది. హీరో, డైరెక్టర్ మధ్య వచ్చే ఇగో క్లాష్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. సినీ పరిశ్రమలో హీరోలు, నటీనటుల క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వచ్చే సంఘర్షణలను చాలా బాగా చూపించాడు డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే సముద్రఖని, రానా దగ్గుబాటి నటన కూడా మెప్పించింది. ఓవరాల్ గా సినిమాకు తమిళనాట మంచి రివ్యూలే వచ్చాయి. కానీ ఇతర భాషల్లో మాత్రం అనుకున్న రెస్పాన్స్ రాలేదు. థియేటర్లలో చూడకపోయి ఉంటే ఈ కాంత సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
Experience love in its purest rhythm with #KaatukaKannulavo song from the movie #Kaantha.🥰💞
🎵 https://t.co/XpHIwDUlWZ@dulQuer #BhagyashriBorse #JhanuChanthar @Sreeram_singer @kk_lyricist #LyricalVideosongs #LyricalVideoSong @amusicbuzzz #amusicbuzzz @adityamusic pic.twitter.com/8A5hfclxZH
— Aditya Music Buzzz (@amusicbuzzz) November 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.