Guns and Gulaabs: ఓటీటీలో మరో క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

|

Jul 23, 2023 | 5:28 PM

'ది ఫ్యామిలీమ్యాన్‌', 'ఫర్జీ' వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు దర్శకుడు రాజ్‌ అండ్‌ డీకే. ఈ రెండు క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లు వ్యూయర్‌షిప్‌లో రికార్డులు కొల్లగొట్టాయి. ఇప్పుడీ డైరెక్టర్ల నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ రానుంది.

Guns and Gulaabs: ఓటీటీలో మరో క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Guns And Gulaabs
Follow us on

‘ది ఫ్యామిలీమ్యాన్‌’, ‘ఫర్జీ’ వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు దర్శకుడు రాజ్‌ అండ్‌ డీకే. ఈ రెండు క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లు వ్యూయర్‌షిప్‌లో రికార్డులు కొల్లగొట్టాయి. ఇప్పుడీ డైరెక్టర్ల నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ రానుంది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్’. సౌత్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్‌తో పాటు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్, ఆద‌ర్శ్ గౌర‌వ్, గుల్ష‌న్ దేవ‌య్య ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 18 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేశారు మేకర్స్‌.

గన్స్ అండ్‌ గులాబ్స్‌ వెబ్‌ సిరీస్‌లో స్టైలిష్‌ గ్యాంగస్టర్‌గా కనిపించనున్నారు దుల్కర్‌ సల్మాన్‌. ఈ స్టార్‌ హీరోకు ఇదే మొదటి వెబ్‌ సిరీస్‌ కావడం గమనార్హం. గులాబ్ గంజ్ అనే ప్రాంతంలో గ్యాంగ్‌స్ట‌ర్స్‌కు, పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన పోరాటం ఆధారంగా ఈ క్రైమ్‌ సిరీస్‌ను రూపొందించినట్లు సమాచారం. 90ల్లో జరిగిన ఓ రియల్‌గా జరిగిన సంఘటనలతో ఈ సిరీస్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.