
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అక్టోబర్ 31, 2024 న విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం మరో చరిత్ర సృష్టించింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో లక్కీ భాస్కర్ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది.
కట్టిపడేసే కథా కథనాలు, నటీనటుల అద్భుత నటన, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇలా అన్నీ తోడై లక్కీ భాస్కర్ ను గొప్ప చిత్రంగా నిలిపాయి. అందుకే అప్పుడు థియేటర్లలో, ఇప్పుడు ఓటీటీలో ఈ స్థాయి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం యొక్క వైవిద్యమైన కథాంశం, భాషతో సంబంధం లేకుండా అందరి మన్ననలు పొందుతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం కథకి ప్రాణం పోసింది. ఇక భాస్కర్ పాత్రలో ఒదిగిపోయిన దుల్కర్ సల్మాన్, తన అత్యుత్తమ నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు. అలాగే చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా చేశారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌ని ప్రదర్శించినప్పటి నుండి, లక్కీ భాస్కర్ చిత్రం స్ట్రీమింగ్ ట్రెండ్‌లలో ఆధిపత్యం చెలాయించింది. మిలియన్ల కొద్దీ వీక్షణలను పొందడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రేక్షకులకు అభిమాన చిత్రంగా మారింది. మొదటి వారంలో ఏకంగా 15 దేశాలలో నెట్‌ఫ్లిక్స్ యొక్క టాప్ 10లో మొదటి స్థానాన్ని పొందింది. అలాగే 17.8 బిలియన్ నిమిషాల వీక్షణలతో, రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన తొలి సౌత్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది.
Lucky bhaskar movie trending in Netflix for 13 weeks 🎬#LuckyBhaskar #Netflix”
#LuckyBhaskar #Trending”
#LuckyBhaskar #MustWatch”
– *”Crime, Drama, and Suspense!* ‘Lucky Bhaskar’ has it all. Watch the movie that’s been trending on Netflix for 13 weeks straight! #LuckyBhaskar pic.twitter.com/ocyY1nogFA— vamshi (@VamshilalD28988) February 26, 2025
నెట్‌ఫ్లిక్స్‌లో లక్కీ భాస్కర్ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. మీలో ఎవరైనా ఇంకా ఎవరైనా లక్కీ భాస్కర్ చిత్రాన్ని చూడనట్లయితే వెంటనే నెట్‌ఫ్లిక్స్ లో వీక్షించి, భాస్కర్ ప్రయాణాన్ని ఆస్వాదించండి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..