
థియేటర్స్ లో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతివారం కొత్త కొత్త సినిమాలు విడుదలై విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు హిట్ అవుతున్నాయి. ఇక ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. వారం వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలతో ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇక ఓటీటీల్లో రకరకాల జోనర్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. భయపడుతూనైనా హారర్ సినిమాలు చూస్తూ ఉంటారు కొందరు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు ఓ హారర్ సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్ లో భయపెడుతుంది. అంతేకాదు టాప్ లో ట్రెండ్ అవుతుంది ఈ హారర్ సినిమా..
ఈ సినిమాలో ఓ అందమైన అమ్మాయి తన వయ్యారంతో ప్రజలను ఆకర్షిస్తుంది. అయితే ఆమెను ప్రేమించిన వ్యక్తి ఏదోలా చనిపోతూ ఉంటాడు. దాంతో ఆమెకు అందంతో పాటు శాపం కూడా ఉందని ఊర్లో వాళ్లు అనుకుంటారు. ఆమెను ఊర్లో నుంచి గెంటేస్తారు. దాంతో ఆమె ఒంటరిగాజీవిస్తూ ఉంటుంది . ఓ ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆమె జీవితంలో ఊహించని మలుపు తరుగుతుంది.
ఆమెను స్కూల్ డేస్ నుంచి ఓ వ్యక్తి ఇష్టపడుతూ ఉంటాడు.. అనుకోకుండా ఆమెను కలుసుకుంటాడు. అయితే ఆమెకు శాపం ఉందన్న నమ్మకాన్ని పోగొట్టాలని ప్రయత్నిస్తుంటాడు. దాంతో అతను ఊహించని ప్రమాదాలు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో అతనికి ఆమె గురించి ఊహించని విషయాలు బయటపడతాయి. ఊహించని ట్విస్ట్ లు ఎదురవుతాయి. అక్కడి నుంచి సినిమా టర్న్ తీసుకుంటుంది. అసలు ఆమెకు ఉన్న శాపం నిజమేనా.. ఆమె గురించి అతనికి తెలిసిన విషయాలు ఏంటి.? ఆ హీరో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.. ఈ సిరీస్ పేరు ది విచ్. ఇది ఒక కొరియన్ సిరీస్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ సీన్ సీన్ కు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకండి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి