
సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ థ్రిల్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తీసుకువచ్చింది. ఆ సిరీస్ పేరు ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్‘. ప్రస్తుతం ఈ సిరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ లో మొత్తం 50 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇందులో అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, ప్రీతి శర్మ, గురు కీలకపాత్రలు పోషించారు. అలాగే జెస్విని దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఇప్పుడు డిసెంబర్ 5 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్‘ సిరీస్ అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..
ఈ సిరీస్ కు అశ్వతన్ మ్యూజిక్ అందించారు. ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి మూడు హత్యలు జరిగితే ఆ కేసును ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా సాల్వ్ చేశారనేది ఈ సిరీస్ లో ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు. నగరంలో ఒకే రాత్రి జరిగిన 3 హత్యల కేస్ సాల్వ్ చేసేందుకు రంగంలోకి దిగిన ఏసీపీ అశ్విన్ నేరస్తులను పట్టుకున్నాడా లేదా ఈ కేసుల విచారణ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్‘ సిరీస్ లో చూడాలి.
ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..
ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో ఆద్యంతం ఉత్కంఠగా సాగే ట్వి్స్టులు.. ఊహించని మలుపులు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈసిరీస్ ప్రేక్షకులకు థ్రిల్ అందిస్తుంది. కేసుల చుట్టూ సాగే ఈ ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ఇప్పుడు ఆహా ఓటీటీలో చూడొచ్చు.
The investigation begins this December 🚨🚔#DhoolpetPoliceStation Premieres 5th Dec only on #aha
Every Friday – New Episodes#DhoolpetOnaha pic.twitter.com/EUadfirmZm— ahavideoin (@ahavideoIN) November 20, 2025
ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..