Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి రానున్న షరతులు వర్తిస్తాయి.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

|

May 14, 2024 | 8:15 PM

అదే షరతులు వర్తిస్తాయి. 30 వెడ్స్ 21 సిరీస్ ఫేమ్ చైతన్య రావ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో చైతన్యతోపాటు భూమి శెట్టి కథానాయికగా నటించగా.. కుమారస్వామి దర్శకత్వం వహించారు. మార్చి 15న థియేటర్లలో విడుదలైన సినిమాకు అంతగా పబ్లిసిటీ రాలేదు. కానీ అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నంద కిశోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పలమూరు, వెంకీ, శివ కళ్యాణ్, మల్లేష్ బలస్త్ కీలకపాత్రలు పోషఇంచిన ఈ సినిమాను లైట్స్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున సామల నిర్మించారు. ఈ చిత్రానికి అరుణ్ చిలువేరు మ్యూజిక్ అందించారు.

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి రానున్న షరతులు వర్తిస్తాయి.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
Sharathulu Varthisthai Ott
Follow us on

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలను తీసుకువస్తుంది. ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది సివిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆహా.. ఇప్పుడు మరో చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకురాబోతుంది. అదే షరతులు వర్తిస్తాయి. 30 వెడ్స్ 21 సిరీస్ ఫేమ్ చైతన్య రావ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో చైతన్యతోపాటు భూమి శెట్టి కథానాయికగా నటించగా.. కుమారస్వామి దర్శకత్వం వహించారు. మార్చి 15న థియేటర్లలో విడుదలైన సినిమాకు అంతగా పబ్లిసిటీ రాలేదు. కానీ అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నంద కిశోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పలమూరు, వెంకీ, శివ కళ్యాణ్, మల్లేష్ బలస్త్ కీలకపాత్రలు పోషఇంచిన ఈ సినిమాను లైట్స్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున సామల నిర్మించారు. ఈ చిత్రానికి అరుణ్ చిలువేరు మ్యూజిక్ అందించారు.

ట్రైలర్, టీజర్, పాటలతో విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. షరతులు వర్తిసాయి సినిమా ఆహా ఓటటీ వేదికగా మే 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. మంచి మిడిల్ క్లాస్ మూవీ చూడాలిని ఉందా.. అయితే షరతులు వర్తిస్తాయి. సినిమా మే18న ఆహాలో ప్రీమియర్ కానుంది అంటూ ట్వీట్ చేసింది ఆహా.

కథ విషయానికి వస్తే..
ఆర్థికంగా మోసపోయిన మధ్య తరగతి కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనే అంశం చుట్టూ ఈసినిమాను రూపొందించారు. ప్రభుత్వం ఉద్యోగం చేసే వ్యక్తి కుటుంబాన్ని నడిపేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు.. వివాహం జరిగిన తర్వాత అతడి జీవితంలో ఏం జరిగింది.. ఆర్థిక ఇబ్బందులను, మోసాలను ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా. ఈ సినిమాలో మరోసారి తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు చైతన్య. మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా జీవించేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.