
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు ఆసక్తికర వెబ్ సిరీస్ లు, అదిరిపోయే గేమ్ షోలతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఆహాలో దూసుకుపోతున్నాయి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న సర్కార్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సుడిగాలి సుధీర్ హోస్టింగ్, సెలబ్రిటీల సందడితో ఈ గేమ్ షోకు టాప్ రేటింగ్స్ వస్తున్నాయి. కాగా సర్కార్ తొలి మూడు సీజన్లకు ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవహరించాడు. గత నాలుగో సీజన్ నుంచి సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సహజంగానే ఈ ప్రోగ్రామ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. ‘ఈసారి అంతకు మించి’ అనేలా ఇప్పుడు సర్కార్ ఆరో సీజన్ సాగుతుంది.
ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ గేమ్ షోలో సందడి చేస్తున్నారు. సీజన్ 6లో సందడి చేయడానికి మరికొంతమంది సెలబ్రెటీలు గెస్ట్ లుగా ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఇందుకు సబంధించిన ప్రోమోను విడుదల చేశారు. సర్కార్ సీజన్ 6 పదో ఎపిసోడ్ లో గెస్ట్ లుగా ఈసారి నలుగురు సెలబ్రెటీలు హాజరు కానున్నారు.
సర్కార్ సీజన్ 6 పదో ఎపిసోడ్ లో గెస్ట్ లుగా టాలీవుడ్ కమెడియన్ అలీ, అలాగే బిగ్ బా ఫేమ్ విష్ణు ప్రియా సందడి చేయనున్నారు. వీరితో పాటు నటుడు శివాజీ కూడా సర్కార్ గేమ్ షోలో పాల్గొనున్నారు. ఇక ప్రత్యేక అతిథి.. ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరుకానున్నారు. ఎప్పుడూ సరదగా హుషారుగా ఉండే మల్లారెడ్డి. ఈసారి సర్కార్ స్టేజ్ పై తనదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్ మే 1న స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రేజీ ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వకండి.