Leela Vinodam OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న షణ్ముఖ్ జస్వంత్ రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..

|

Oct 14, 2024 | 8:31 AM

యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీగా వస్తోన్న లీలా వినోదం చిత్రంలో షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటిస్తుండగా.. ఇందులో మ‌ల‌యాళ బ్యూటీ అన‌ఘా అజిత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు ప‌వ‌న్ సుంక‌ర ద‌ర్శకత్వం వహిస్తుండగా.. శ్రీధ‌ర్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆర్ కృష్ణ చేత‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. కొన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

Leela Vinodam OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న షణ్ముఖ్ జస్వంత్ రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..
Leela Vinodam
Follow us on

యూట్యూబ్ స్టార్‏గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. అతడు నటించిన షార్ట్ ఫిల్మ్స్‏కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ వ్యూ్స్ వచ్చాయి. దీంతో అతడికి బిగ్‏బాస్ రియాల్టీ షో ఆఫర్ వచ్చింది. నిజానికి షన్నూ బిగ్‏బాస్ విన్నర్ అవుతాడని అనుకున్నారు. కానీ చివరకు రన్నరప్ అయ్యాడు. ఆ తర్వాత వరుస వివాదాల్లో చిక్కుకున్న షణ్ముఖ్..చాలా రోజులుగా సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు లీలా వినోదం పేరుతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీగా వస్తోన్న లీలా వినోదం చిత్రంలో షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటిస్తుండగా.. ఇందులో మ‌ల‌యాళ బ్యూటీ అన‌ఘా అజిత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు ప‌వ‌న్ సుంక‌ర ద‌ర్శకత్వం వహిస్తుండగా.. శ్రీధ‌ర్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆర్ కృష్ణ చేత‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. కొన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్‏లో లీలా వినోదం సినిమా నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు కొత్త పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో హీరోహీరోయిన్లు సైకిల్ తొక్కుతూ క‌నిపిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రంలో వినోద్ పాత్రలో షణ్ముఖ్, లీలా పాత్రలో అనఘా అజిత్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. లీలా వినోదం సినిమాతోపాటు మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు షణ్ముఖ్.

లీలా వినోదం సినిమా తర్వాత డైరెక్టర్ భీమాశంక‌ర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని నేరుగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. 70 ఎమ్ఎమ్ స్క్రీన్ పై తనను తాను చూసుకోవాలనే కల నిజమవుతుందని.. ఎంత కిందపడిన తనను అడియన్స్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారంటూ ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు షణ్ముఖ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.