నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. థియేటర్లలో అఖండ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అటు వెండితెరపై తన నటనతోనే కాకుండా.. ఓటీటీలోనూ తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ షోలో ప్రముఖ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో ప్రశ్నలను సందిస్తూ.. గేమ్స్‌తో బాలకృష్ణ చేసే సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఈ షోకు మంచు మోహన్ బాబు.. నాని, బోయపాటి శ్రీను, శ్రీకాంత్, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు వచ్చి సందడి చేశారు. తాజాగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో డైరెక్టర్ రాజమౌళి విచ్చేశారు.
తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. రాజమౌళి రాగానే.. మీరు ఆల్రెడీ ఇంటలిజెంట్.. ఆచీవర్ అని అందరికి తెలుసు.. కానీ ఇంకా ఎందుకు ఈ తెల్ల గడ్డం అని బాలకృష్ణ అడగ్గా.. గడ్డాన్ని సరిచేసుకున్నారు జక్కన్న. ఆ తర్వాత.. ఇప్పటివరకు మన కాంబినేషన్ రాలేదు.. నా అభిమానులు నిన్ను బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అని అడిగారు…నీ సమాధానమేంటీ అసలు అని బాలయ్య అడగ్గా.. మీసాలు మేలేస్తూ సీరియస్ లుక్ ఇచ్చారు జక్కన్న.. అలాగే.. మీతో సినిమా చేస్తే హీరోకు.. ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు.. ఆ తర్వాత వాళ్ల రెండు మూడు సినిమాలు ఫసకే కదా బాలయ్య అడగ్గా.. రాజమౌళి ఎక్స్ప్రెషన్స్ నవ్వులు పూయించాయి.. సమాధానం చెప్పాలి అని అడగ్గా.. ఇది ప్రోమో అని తెలుసు.. ఆన్సర్స్ ఎపిసోడ్లో చెబుతాను అంటూ ఆన్సర్ ఇచ్చారు రాజమౌళి. మొత్తానికి అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో రాజమౌళితో మరోసారి నవ్వులు పూయించారు బాలయ్య. ఇందుకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది.
Also Read: Pushpa Item Song: సమంత సాంగ్ ఇష్యూపై మాధవిలత సంచలన కామెంట్స్.. ఛ.. పరువు పోయిందంటూ..
Nani: కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. ఆమెను చూసి నటించడమే మర్చిపోయా.. నాని ఆసక్తికర కామెంట్స్..