OTT: 6 కోట్లతో తీస్తే 55 కోట్లు.. ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ప్రస్తుతం మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఓటీటీలో ఈ మాలీవుడ్ మూవీస్ ను ఎగబడి చూస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమాలను ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసం మరో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రానుంది.

OTT: 6 కోట్లతో తీస్తే 55 కోట్లు.. ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie

Updated on: Mar 06, 2025 | 3:56 AM

మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు, కిష్కింద కాండం, రైఫిల్ క్లబ్.. లేటెస్ట్ గా మార్కో.. ఇలా మలయాళ సినిమాలు ఓటీటీలో దుమ్ము రేపుతున్నాయి. సహజత్వానికి దగ్గరగా ఉండడం, థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉండడంతో మాలీవుడ్ సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ లో మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు మరో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. అదే ప్రముఖ నటుడు అసిఫ్‌ అలీ నటించిన రేఖా చిత్రం. ఈ ఏడాది జనవరి 09న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మలయాళ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా 2025 లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మలయాళ సినిమాల్లో ఒకటిగా రికార్డును క్రియేట్ చేసింది. కేవలం 6 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కిన రేఖా చిత్రం సినిమా రూ.55 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా మెప్పించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ రేఖా చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి 7 నుంచి రేఖా చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది సోనీ లివ్.

‘అందరూ మర్చిపోయిన నేరం.. పాతిపెట్టిన నిజాన్ని వెలికితీసే సమయం ఆసన్నమైంది. మార్చి 7న రేఖాచిత్రం సోనీలివ్‌లో చూసేయండి’ అంటూ రేఖా చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ పై అప్ డేట్ ఇచ్చింది సోనీ లివ్. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రేఖా చిత్రం స్ట్రీమింగ్ కు రానుంది.

ఇవి కూడా చదవండి

మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్

జోఫిన్ టి. చాకో తెరకెక్కించిన రేఖా చిత్రం సినిమాలో అసిఫ్‌, అనస్వరతో పాటు మనోజ్‌ కె.జయన్‌, సిద్దిఖి, జగదీశ్‌, సాయికుమార్‌, హరిశ్రీ అశోకన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ముజీబ్‌ మజీద్‌ సంగీతం అందించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.