యాంకర్ సుమ చాలా కాలం తర్వాత జయమ్మ పంచాయతీ (Jayamma Panchayathi) సినిమాతో బిగ్ స్క్రీన్ పై సందడి చేసింది. సుమ కనకాల ప్రధాన పాత్రలో డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు తరెకెక్కించిన ఈ సినిమా మే 6న విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కుటుంబకథా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇందులో దినేష్ కుమార్, షాలినీ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాతో యాంకర్‌గానే కాకుండా మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది సుమ. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
లేటేస్ట్ సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో జూన్ 14న స్ట్రీమింగ్ కానుందట. జాలి, దయ మొండితనం కలిగిన ఓ మహిళ.. తన కుటుంబ సమస్యలతోపాటు.. ఊళ్లో సమస్యల పట్ల పోరాడుతుంది. ఆమె భర్త అనారోగ్యంతో ఉంటాడు. ఆమె తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటుంది. తన నిర్ణయానికి కట్టుబడిన ఆమె గ్రామంపై కూడా పోరాటానికి సిద్ధమవుతుంది. జయమ్మకు పంచాయతీలో ఎదురైన సవాళ్లు ఏంటీ ? వాటిని ఆమె ఎలా పరిష్కరించగలిగింది అనేదే జయమ్మ పంచాయతీ.. ఈ సినిమా జూన్ 14న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.