Akkada Ammai Ikkada Abbai: ఓటీటీలోకి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

బుల్లితెరపై తనదైన యాంకరింగ్ ద్వారా ప్రేక్షకులను అలరించారు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. కామెడీ పంచ్ డైలాగ్స్, వాక్చాతుర్యంతో పలు షోలలో సందడి చేశాడు. కానీ ఇప్పుడు హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్నాళ్లుగా బుల్లితెరకు దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు ప్రదీప్.

Akkada Ammai Ikkada Abbai: ఓటీటీలోకి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Akkada Ammayi Ikkada Abbayi

Updated on: May 02, 2025 | 12:47 PM

బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన యాంకర్ ప్రదీప్ ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ఫస్ట్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాకు అడియన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నటన పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈ సినిమా తర్వాత రెండో ప్రయత్నంగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో మరోసారి అడియన్స్ మందుకు వచ్చాడు. ఇందులో ప్రదీప్ జోడిగా యాంకర్ దీపిక పిల్లి కథానాయికగా నటించింది. ఈ సినిమాతోనే ఆమె హీరోయిన్ గా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం పేరుతోనే వచ్చిన ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకులను ఆసక్తిని రెట్టింపు చేసింది.

ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రదీప్, సత్య కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. థియేటర్లలో విడుదలై నెల రోజులు పూర్తి కాకుండానే ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో ఈ సినిమా మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈటీవీ విన్ పోస్టర్ షేర్ చేసింది. ద

కథ విషయానికి వస్తే..
కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) సివిల్ ఇంజనీర్. తన బాస్ ఆదేశాలతో బైరిలంక అనే ఊళ్లో మరుగుదొడ్లు కట్టేందుకని.. డ్రైవర్ బిలాల్ (సత్య) తో కలిసి వెళ్తాడు. అక్కడ ముప్పయ్యేళ్ల కిందట వర్షాలు లేక కరవు తాండవిస్తున్న దశలో ఓ అమ్మాయి పుడుతుంది. ఆమె పుట్టగానే వర్షాలు కురిసి కరువు పోతుుంది. ఆమె పేరు రాజకుమారి (దీపిక). ఆమె ఊరు దాటి వెళ్లడానికి వీల్లేదని కండిషన్ ఉంటుంది. దీంతో ఊళ్లో ఉన్న అరవై మంది కుర్రాళ్లలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఊరి పెద్ద తీర్పు చెబుతాడు. ఈ క్రమంలోనే ఆ ఊరికి వచ్చిన ఇంజినీర్ కృష్ణకు రాజకుమారికి ప్రేమ ఎలా మొదలవుతుంది.. ? చివరకు కృష్ణ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు అనేది సినిమా.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..