Agent OTT: ఎట్టకేలకు ‘ఏజెంట్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే.?

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఏజెంట్'. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు సమాచారం. ఆ సమాచారం మీకోసమే..

Agent OTT: ఎట్టకేలకు ఏజెంట్ ఓటీటీ డేట్ ఫిక్స్..  స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే.?
Agent Movie

Updated on: Jun 06, 2023 | 3:30 PM

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు సమాచారం. జూన్ 23 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. తొలుత ఈ మూవీ మే 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరగ్గా.. అది కాస్తా వాయిదా పడింది. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో భారీ అంచనాలతో ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఓటీటీ ఎక్స్‌పీరియన్స్ కోసం కొన్ని సీన్లు తొలగించి మేకర్స్ ఎడిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందువల్లే ఓటీటీలో విడుదలకు ఆలస్యమైందని సమాచారం. కాగా, స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో డినో మోరియా, మమ్మూట్టీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది. ఈ మూవీకి కథ వక్కంతం వంశీ అందించగా.. బాణీలను హిప్ హాప్ టమిజా స్వరపరిచాడు.