Balakrishna Birthday: బాలయ్యకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆహా.. కళ్లకు గంతలు కట్టి గ్రాండ్‌గా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌.. వీడియో ఇదుగో..

Aha Indian Idol: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నేడు (జూన్‌10) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బాలయ్యకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సంస్థ ఆహా

Balakrishna Birthday: బాలయ్యకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆహా.. కళ్లకు గంతలు కట్టి గ్రాండ్‌గా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌.. వీడియో ఇదుగో..
Balakrishna Birthday

Updated on: Jun 10, 2022 | 6:26 PM

Aha Indian Idol: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నేడు (జూన్‌10) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బాలయ్యకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సంస్థ ఆహా (Aha) బాలకృష్ణకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇండియన్ ఐడల్ (Indian Idol) తెలుగు షో ఫినాలే వేదికగా ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించింది. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రముఖ సింగర్ ఉషా ఉతుప్‌, షో జడ్జీలుగా వ్యవహరిస్తోన్న సంగీత దర్శకుడు తమన్, గాయకుడు కార్తిక్‌లు బాలకృష్ణ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత వేదికపైన ఏర్పాటు చేసిన కేకు వద్దకు తీసుకెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అనంతరం బాలయ్య కేక్ కట్ చేయగా జడ్జీలు, సింగర్స్ బాలయ్యకు ప్రత్యేకంగా విషెస్‌ చెప్పారు.

కాగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఇండియన్ ఐడల్ తెలుగు షో తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్‌లో ఫినాలేకు చేరుకున్న కంటెస్టెంట్ల వివరాలను ప్రకటించనున్నారు. ఆ తర్వాత జరిగే పోటీలో విన్నర్స్ ఎవరనేది ప్రకటించనున్నారు. కాగా ఆహాలో అన్‌స్టాపబుల్ అంటూ బాలయ్య చేసిన సందడి ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటివరకు కేవలం ఒక నటుడిగానే మనకు తెలిసిన బాలయ్య తన అద్భుతమైన హోస్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. త్వరలోనే బాలయ్యతో అన్‌స్టాపబుల్ సీజన్-2కు ప్లాన్ చేస్తోంది ఆహా బృందం. దీని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించనుంది. మైత్రి మూవీ మేకర్స్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం టీజర్‌ నిన్న విడుదలై యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపటి నుంచి జ్యేష్టాభిషేకం టికెట్ల బుకింగ్‌.. పూర్తి వివరాలివే..

IND vs SA: అప్పుడు విరాట్‌.. ఇప్పుడు పంత్‌.. సేమ్‌ టు సేమ్‌ ఐదేళ్ల నాటి చరిత్ర రిపీట్..

Andhra Pradesh: తిరుపతిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. ఎన్టీఆర్ రాజుకు ఘన సన్మానం