
థియేటర్స్ లో చిన్న సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాగే ఇటీవల విడుదలైన కొత్త సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి విజయాన్నిఅందుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది ఈ మూవీ. ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ మూవీ. ఓటీటీలో ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.?
ఆ సినిమా మరేదో కాదు అడవి శేష్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ డెకాయిట్. ఈ సినిమాలో అడివి శేష్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్స్ లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. ఈ మూవీ మే 8న ఓటీటీలో రిలీజైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది డెకాయిట్ మూవీ.
ఓటీటీలో ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్.. డెకాయిట్ సినిమాను రిపీటెడ్ గా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా ‘డెకాయిట్’ దూసుకెళ్తోంది. విడుదలైన ఒకే ఒక్క రోజు ఓటీటీని షేక్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక ఈ సూపర్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.