
మెంటల్ మదిలో సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj). మొదటి సినిమాతోనే నటన పరంగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత.. బ్రోచేవారెవరురా మూవీలో నటించి మెప్పించింది. త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల .. వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ఈ సినిమా తర్వాత తెలుగులో నివేదాకు వరుస ఆఫర్స్ తలుపుతట్టాయి. ఇటీవల విశ్వక్ సేన్ సరసన పాగల్ మూవీలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించినంతగా హిట్ కాలేదు కానీ.. నివేదా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ నివేదాకు క్రేజ్ ఎక్కువగాన ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటించిన బ్లరీ మేరీ మూవీ ఈనెల 15న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్, వీడియోస్ బ్లడీ మేరీ పై క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. పూర్తి క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ అంధురాలి పాత్రలో నటించింది.ఈ చిత్రానికి డైరెక్టర్ చందు మోండేటి దర్శకత్వం వహించారు. ఇందులో కిరటీ దామరాజ్, బ్రహ్మాజీ, అజయ్ కీలకపాత్రలలో పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. కాలబైరవ సంగీతం అందించారు.
BTS is just a kick-ass beginning of #BloodyMaryOnAHA. Mundu undi, Mary Masthi. Premiers April15. Get ready?
▶️https://t.co/4xu7KHf3yh#BloodyMaryOnAHA@ahavideoIN @chandoomondeti @Nivetha_Tweets @KirrD @Actor_Rajkumar9 @vishwaprasadtg @vivekkuchibotla @actorbrahmaji pic.twitter.com/FhwSSuKxzF— People Media Factory (@peoplemediafcy) April 8, 2022
Also Read: Manchu Vishnu: సన్నీ లియోన్‌ను చూసి భయపడి పారిపోయిన మంచు విష్ణు.. నెట్టింట్లో వైరలవుతున్న వీడియో..
Akira Nandan: అకీరాకు బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్..
Ranbir Kapoor Alia Bhatt: బాలీవుడ్లో పెళ్లి భజాలు.. రణబీర్ కపూర్, అలియా పెళ్లికి అతిథులు వీరే..
Mahesh Babu: ఒకే రోజు 30 మందికి ప్రాణ దానం.. మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్..