
తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్.. సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆహాలో విడుదలైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలనే కాకుండా.. ఇతర భాషల సినిమాలను సైతం డబ్ చేస్తూ.. ఇతర ఓటీటీ సంస్థలకు గట్టి పోటినిస్తుంది ఆహా. రెగ్యూలర్ కంటెంట్‌తో విసిగిపోయిన ప్రేక్షకులకు అనుక్షణం ఊత్కంఠంగా సాగే సస్పెస్స్ థ్రిల్రర్ సిరీస్‌లను.. భారీ బడ్జెట్ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ ఆడియెన్స్‌ను అలరిస్తూ.. సక్సెెస్ దిశలో టాప్ ప్లేసులో దూసుకెళ్తుంది ఆహా. తాజాగా మరో సూపర్ హిట్ మూవీని విడుదల చేయబోతుంది తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.
యంగ్ హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఎస్. దర్శన్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మీనాక్షి చౌదరి, వెంకట్, ఐశ్వర్య, అభినవ్ గోమటం, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని.. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి – ఏక్తా శాస్త్రి – హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 17న ఆహాలో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.
ట్వీట్..
Bigg Boss 5 Telugu: మర్యాద ఇవ్వకపోతే ఊరుకునేదే లేదు.. అతడి పై అరుస్తూ చిందులువేసిన ఆనీ మాస్టర్..