Ram Charan: డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వనున్న మెగా పవర్‌ స్టార్‌.. ఏకంగా అమెరికన్‌ వెబ్‌ సిరీస్‌తో..

|

Feb 17, 2022 | 6:46 PM

Ram Charan: కరోనా మనుషుల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో లేదో తెలియదు కానీ.. విద్యా, వ్యాపారం, వినోద రంగాల్లో మాత్రం సమూల మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌కు సరికొత్త అర్థం చెప్పిన ఓటీటీకి (OTT) విపరీతంగా క్రేజ్‌ పెరిగింది...

Ram Charan: డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వనున్న మెగా పవర్‌ స్టార్‌.. ఏకంగా అమెరికన్‌ వెబ్‌ సిరీస్‌తో..
Ram Charan
Follow us on

Ram Charan: కరోనా మనుషుల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో లేదో తెలియదు కానీ.. విద్యా, వ్యాపారం, వినోద రంగాల్లో మాత్రం సమూల మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌కు సరికొత్త అర్థం చెప్పిన ఓటీటీకి (OTT) విపరీతంగా క్రేజ్‌ పెరిగింది. అంతకు ముందు నుంచే ఓటీటీ సేవలు అందుబాటులో ఉన్నా కరోనా (Corona) తర్వాత వీటికి డిమాండ్‌ మరింత పెరిగింది.

ఇక బడా నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టడంతో వెబ్‌ సిరీస్‌ల నిర్మాణ ప్రమాణాల్లోనూ మార్పులు వచ్చాయి. భారీ బడ్జెట్‌ సినిమాలను తల్లదన్నే రీతిలో వెబ్‌ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. బడా హీరోలు సైతం వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ ఇప్పటికే దూసుకుపోతుండగా. టాలీవుడ్‌లోనూ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది.

ఇప్పటికే పలు నటీ, నటులు వెబ్‌ సిరీస్‌ ద్వారా డిజిటల్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇవ్వగా తాజాగా మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా వెబ్‌ సిరీస్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించనున్న ఓ వెబ్‌సిరీస్‌లో రామ్‌ చరణ్‌ నటించనున్నారని సమాచారం. అమెరికాకు చెందిన ఓ పాపులర్‌ వెబ్‌సిరీస్‌ను భారత్‌లో రీమేక్‌ చేయనున్నారని, ఇందుకోసం చరణ్‌ను తీసుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నారని సమాచారం.

భారతీయ నేటివిటీకి అనుగుణంగా ఆ సిరీస్‌లో పలు మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్‌ దర్శకుడు డైరెక్ట్‌ చేయనున్న ఈ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి చెర్రీ కూడా సుముఖత వ్యక్తం చేశారని టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Gangubai Kathiawadi: విడుదలకు ముందే ‘గంగూబాయ్​ కతియావాడీ’కు మరో షాక్.. కుటుంబం పరువు తీశారంటూ..

Viral Video: అమ్మ కష్టం తెలిసిన స్మార్ట్ బాయ్.. ఈజీగా, అందంగా బట్టలు మడతబెడుతున్న వీడియో వైరల్..

Vijayawada: బెజవాడ నడిబొడ్డున ట్రాఫిక్ కష్టాలకు చెక్.. బెంజ్ సర్కిల్ సెకండ్ ఫ్లై ఓవర్ ప్రారంభం..