
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన లేటేస్ట్ మూవీ శంబాల. గతేడాది డిసెంబర్ నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మిస్టిల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈనెల 22 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగానే చూసే అవకాశం ఉందని ఆహా సోషల్ మీడియాలో ప్రకటించింది. అలాగే ఇన్నాళ్లు థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీలో నేరుగా ఇంట్లోనే చూడొచ్చు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో అర్చన అయ్యర్ కథానాయికగా నటించింది. ఎలాంటి అంచనాలు హడావిడి లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది.
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
కథ విషయానికి వస్తే.. 1980వ దశకం నేపథ్యంల సాగే కథ ఇది. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఊరు శంబాల. అక్కడ ఆకాశం నుంచి ఓ ఉల్క పడుతుంది. అప్పటినుంచి ఊరిలో అనూహ్యమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఎవరో ఒకరు విచిత్రంగా ప్రవర్తిస్తూ హత్యలు చేస్తారు. ఆత్మహత్యలు చేసుకుంటారు. మూడ నమ్మకాలు ఎక్కువ కావడంతో.. ఆ రహస్యాలను చేధించేందుకు ప్రభుత్వం విక్రమ్ (ఆది సాయికుమార్) అనే యువ శాస్త్రవేత్తను ఆ గ్రామానికి పంపిస్తుంది. విక్రమ్ కు ఆ ఊరిలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. ? చివరకు ఆ రహస్యాలను చేధించాడా ? లేదా అనేది సినిమా. ఇప్పుడు ఈ మూవీ ఆహాలోకి రాబోతుంది.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
Step into a mystical world where myths come alive and destiny roars.#AadiShambhala Premieres 22nd Jan only on #aha
(24hrs early access for aha gold users)@iamaadisaikumar @tweets_archana #RajasekharAnnabhimoju #MahidharReddy @ugandharmuni pic.twitter.com/bHke5Hmu5b— ahavideoin (@ahavideoIN) January 15, 2026
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..