Tollywood: ఓటీటీ ఫ్యాన్స్‌కు పండగే.. ఒకేసారి ఆ రెండు చిత్రాలు.. ఎక్కడ చూడొచ్చునంటే..

|

Oct 22, 2022 | 11:00 AM

ప్రతీ వారం విభిన్న జోనర్స్‌కు చెందిన చిత్రాలు ఓటీటీ ప్రపంచంలో సందడి చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వచ్చేవారం ఓ రోజు వ్యవధిలో..

Tollywood: ఓటీటీ ఫ్యాన్స్‌కు పండగే.. ఒకేసారి ఆ రెండు చిత్రాలు.. ఎక్కడ చూడొచ్చునంటే..
Brahmastra And Ghost
Follow us on

ఈ మధ్యకాలంలో థియేటర్ల మాట అటుంచితే.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు మాత్రం ఓ వర్గం ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. కొందరు వేలల్లో డబ్బులు వెచ్చించి థియేటర్లలో సినిమాలు చూసే బదులు కుటుంబంతో కలిసి అదే చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ వారం విభిన్న జోనర్స్‌కు చెందిన చిత్రాలు ఓటీటీ ప్రపంచంలో సందడి చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వచ్చేవారం ఓ రోజు వ్యవధిలో ఒకేసారి రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఓటీటీలోకి రానున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

  • ది ఘోస్ట్:

దసరా కానుకగా విడుదలైన నాగార్జున యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఘోస్ట్’. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలవగా.. నవంబర్ 2వ తేదీ నుంచి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నాగార్జున గత చిత్రం ‘వైల్డ్ డాగ్’కు ఓటీటీలో విశేష ఆదరణ లభించింది. మరి ఘోస్ట్‌కు కూడా ఆ స్థాయిలో ఆదరణ దక్కుతుందో లేదో చూడాలి.

  • బ్రహ్మాస్త్ర:

రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అస్త్రావెర్స్ నేపధ్యంలో ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో కనిపించారు. ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 శివగా సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. హిందీతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటిదాకా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబర్ 4వ తేదీ నుంచి ‘బ్రహ్మాస్త్ర’ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. కాగా, ఒక్క రోజు వ్యవధిలో రాబోయే ఈ రెండు చిత్రాలు.. ప్రేక్షకులను ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తాయో వేచి చూడాలి.