OTT: ఓటీటీల వైపే మొగ్గుచూపుతున్న సినీ ప్రియులు.. హిట్ టాక్ దక్కించుకున్నా ఇదే జరుగుతుందా?

ప్రస్తుతం థియేటర్లకు వచ్చి సినిమా చూడాలంటే హిట్ టాక్ రావాల్సిందే. అయితే, హిట్ టాక్ దక్కిన తర్వాత కూడా సామాన్యంగా, సాదాసీదాగా ఉంటే చూసే వాళ్ల సంఖ్య తక్కువే. సినిమా బాగుండి కూడా తక్కువ రోజులకే ఓటీటీల్లోకి వచ్చి భారీ వ్యూస్ సొంతం చేసుకుంటున్న

OTT: ఓటీటీల వైపే మొగ్గుచూపుతున్న సినీ ప్రియులు.. హిట్ టాక్ దక్కించుకున్నా ఇదే జరుగుతుందా?
Kantara & Mirai

Updated on: Nov 15, 2025 | 5:18 PM

ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమా, తర్వాత ఈస్ట్ మన్ కలర్, డిజిటల్, త్రీడీ.. ఇలా టెక్నాలజీతోపాటు సినిమా కూడా కొత్త మార్పులను సంతరించుకుంది. అలాగే, కరోనా తర్వాత సినిమాను థియేటర్లకు వచ్చి చూసేవాళ్ల సంఖ్య తగ్గినా.. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ను మాత్రం ఇంట్లో ఎంత పెద్ద టీవీలో చూసినా కలగదు. కొన్ని సినిమాలు థియేటర్‌‌లో చూస్తేనే ఆ విజువల్స్, సౌండ్ సినీ ప్రేమికుడికి నిజమైన అనుభూతిని అందిస్తాయి.

ప్రస్తుతం థియేటర్లకు వచ్చి సినిమా చూడాలంటే హిట్ టాక్ రావాల్సిందే. అయితే, హిట్ టాక్ దక్కిన తర్వాత కూడా సామాన్యంగా, సాదాసీదాగా ఉంటే చూసే వాళ్ల సంఖ్య తక్కువే. సినిమా బాగుండి కూడా తక్కువ రోజులకే ఓటీటీల్లోకి వచ్చి భారీ వ్యూస్ సొంతం చేసుకుంటున్న సినిమాలేంటో.. వాటికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో.. ఎంత ట్రెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం టాప్ 5లో ఉన్న సినిమాలేంటో చూసేద్దామా..

OTT ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు సినిమా ప్రేమికులకు పర్ఫెక్ట్ డెస్టినేషన్‌గా మారాయి. థియేటర్‌లలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సినిమాలు, OTTలోకి వచ్చిన తర్వాత కూడా అత్యధిక వ్యూస్​తో ఆకట్టుకుంటున్నాయి. డిజిటల్​ ఎంటర్​టైన్​మెంట్​ యుగంలో థియేటర్​కి ప్రత్యామ్నయంగా మారింది ఓటీటీ. ఆర్మాక్స్ మీడియా రిపోర్ట్ ప్రకారం, 2025 నవంబర్ మొదటి రెండు వారాల్లో 4.1 మిలియన్​ వ్యూస్​తో ‘కాంతార చాప్టర్ 1’ మొదటి స్థానాన్ని సాధించింది. ఈ లిస్ట్‌లో తెలుగు, మలయాళం, హిందీ సినిమాలు పాన్​ఇండియా రేంజ్​లో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఓటీటీలో ట్రెండింగ్​లో ఉన్న టాప్​ 5 సినిమాలేంటో చూద్దాం..

కాంతార చాప్టర్ 1

హీరో రిషబ్​ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా కాంతార చాప్టర్​ 1. భారతీయ సంప్రదాయం, సంస్కృతి, చరిత్ర ఆధారంగా రూపొందిన కాంతర సినిమాకు ప్రీక్వెల్​గా ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్‌లో 500 కోట్లు సంపాదించిన ఈ ఫిల్మ్, OTTలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అక్టోబర్​ 31 నుంచి అమెజాన్​ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమ్​ అవుతున్న ఈ సినిమా 4.1 మిలియన్ వ్యూస్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది.

Kantara 1

లోకా చాప్టర్ 1

మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల్లోనూ గొప్ప ఆదరణ పొందింది. జియో హాట్​స్టార్​లో విడుదలైన ఈ సినిమా కేవలం రెండు వారాల్లోనే 4 మిలియన్ల వ్యూస్​ను దాటి రెండవ స్థానంలో నిలిచింది. విభిన్నమైన కథాంశం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమా విజయానికి రహస్యం.

Lokah Chapter 1

మిరాయి

జియో హాట్​స్టార్​లో అందుబాటులో ఉన్నఈ సినిమా 3.1 మిలియన్ల వీక్షణలను సాధించి మూడవ స్థానంలో నిలిచింది. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్​గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాలో VFX, యాక్షన్ హైలైట్​గా నిలిచాయి. తేజ సజ్జా సూపర్ యోధుడిగా, మంచు మానోజ్ విలన్‌గా నటించారు.

Mirai

ఇడ్లీ కొట్టు

ఇడ్లీ కొట్టు (ఇడ్లీ కడై) సినిమాఅక్టోబర్ 29 నుంచి నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమ్​ అవుతోంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. కోలీవుడ్​ స్టార్ ధనుష్​ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా 2.4 మిలియన్ల వ్యూస్లతో నాల్గవ స్థానంలో నిలిచింది.

Idly Kottu

బాఘీ 4

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్​ అవుతోన్న ఈ సినిమా 2 మిలియన్ల వ్యూస్​తో 5వ స్థానంలో నిలిచింది. బాఘీ టైగర్ ష్రాఫ్ స్టంట్ యాక్షన్ ఫ్రాంచైజీ. హై-ఆక్షన్ సీక్వెన్సెస్, సస్పెన్స్ఫుల్ నెర్రేషన్తో ఈ సినిమా యాక్షన్ ప్రియులను ఆకర్షిస్తోంది. పాన్ఇండియా సినిమాలతో పోటీపడుతూ టాప్​ 5లో బాఘీ 4 సినిమా నిలవడం విశేషం.

Baaghi 4

Follow Us