RRR: పులి లేదు, దాడి లేదు అంతా మాయే.. ట్రిపులార్‌లో ఎన్టీఆర్‌ ఎంట్రీ ఫైట్‌ను ఎలా తీశారో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Aug 27, 2022 | 3:29 PM

RRR: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ను ఒక్కసారిగా షేక్‌ చేసింది. దేశ వ్యాప్తంగా ఏకంగా...

RRR: పులి లేదు, దాడి లేదు అంతా మాయే.. ట్రిపులార్‌లో ఎన్టీఆర్‌ ఎంట్రీ ఫైట్‌ను ఎలా తీశారో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Rrr Making Video
Follow us on

RRR: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ను ఒక్కసారిగా షేక్‌ చేసింది. దేశ వ్యాప్తంగా ఏకంగా  రూ. వెయ్యి కోట్లు సాధించి రికార్డులు సృష్టించిందీ సినిమా. కొమురం భీమ్‌, అల్లూరి పాత్రలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించిన ఈ కాల్పనిక కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్‌ ఔరా అనిపించాయి. గ్రాఫిక్‌ వర్క్‌ సినిమాను మరో మెట్టిక్కించని చెప్పాలి.

ఇలా ప్రేక్షకులను మెప్పించిన సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ ఎంట్రీ సీన్‌ ఒకటి. పెద్దపులితో ఎన్టీఆర్‌ చేసే భీకర ఫైట్ థియేటర్లలో ప్రేక్షకులను ఊపిరి బిగబట్టి చూసేలా చేశాయి. అయితే అడవిలో నిజంగానే పెద్దపులి ఎదురు పడినట్లున్న ఈ సన్నివేశాన్ని మేకర్స్‌ ఎలా తెరకెక్కించారో ఎప్పుడైనా ఆలోచించారా.? తాజాగా చిత్ర యూనిట్ ఈ సన్నివేశం మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ముందుగా పులి ఎలా అటాక్‌ చేస్తుందన్న విషయాన్ని రాజమౌళి వివరించారు. అనంతరం దానికి అనుగుణంగా గ్రాఫిక్‌ డిజైనర్స్‌ లేని పులిని క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..